AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయసులోనే పీరియడ్స్.. ఇలా ఎందుకు జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు చిన్న వయసులోనే పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. పాత రోజుల్లో 14 నుంచి 15 ఏళ్లకు వచ్చేవి.. కానీ ఇప్పుడు 8 నుంచి 9 ఏళ్లకే మొదలవుతున్నాయి. ఇలా జరగడం చూసి చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరుగుతోంది, దీని వల్ల భవిష్యత్తులో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని భయపడుతున్నారు. ఈ విషయంపై వైద్య నిపుణులు కొన్ని కీలక విషయాలు చెబుతున్నారు.

చిన్న వయసులోనే పీరియడ్స్.. ఇలా ఎందుకు జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Menstrual Health
Prashanthi V
|

Updated on: Aug 14, 2025 | 1:55 PM

Share

చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణం ఊబకాయం. శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాల హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లే చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణం. ప్రస్తుతం పిల్లల్లో బరువు వేగంగా పెరగడం ఈ సమస్యను మరింత పెంచుతోంది.

పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణాలు

  • జంక్ ఫుడ్.. ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం.
  • నిద్ర లేకపోవడం.. రాత్రి లేట్ గా పడుకోవడం, సరైన నిద్ర లేకపోవడం.
  • శారీరక శ్రమ తక్కువ.. ఆడుకోవడానికి బదులు ఫోన్‌ లు, టీవీ లకు అతుక్కుపోవడం.
  • ఒత్తిడి.. స్కూల్, పరీక్షలు లేదా ఇతర కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురవడం.
  • పైవన్నీ కూడా పిల్లల్లో బరువు పెరగడానికి.. తద్వారా చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి దారి తీస్తున్నాయి.

భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు

చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి జబ్బుల రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..