AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MenstruAI: శాస్త్రవేత్తల అద్భుతమైన ఆవిష్కరణ.. క్యాన్సర్‌ని గుర్తించే స్మార్ట్ శానిటరీ ప్యాడ్‌లు.. రక్త సేకరణ అవసరం లేకుండానే పరీక్ష

ప్రపచం వ్యాప్తంగా రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. క్యాన్సర్ ని మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అని .. ప్రాణాపాయ ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు భవిష్యత్ లో మహిళల ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని.. శానిటరీ ప్యాడ్‌లు క్యాన్సర్‌ను గుర్తిస్తాయని ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ గురించి చెప్పారు.

MenstruAI: శాస్త్రవేత్తల అద్భుతమైన ఆవిష్కరణ.. క్యాన్సర్‌ని గుర్తించే స్మార్ట్ శానిటరీ ప్యాడ్‌లు.. రక్త సేకరణ అవసరం లేకుండానే పరీక్ష
Sanitary Pad Into Life Saving Disease Detector
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 12:42 PM

Share

మహిళల ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ రాబోతోంది. జ్యూరిచ్‌లోని పరిశోధకుల బృందం MenstruEye అనే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది సాధారణ శానిటరీ ప్యాడ్‌లను ఆధునిక వ్యాధి గుర్తింపు పరికరాలుగా మారుస్తుంది. ఋతుస్రావం సమయంలో ఉపయోగించే ప్యాడ్‌ల నుంచి శారీరక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. రక్త పరీక్షలు లేకుండా గతంలో అర్థం చేసుకోవడం అసాధ్యమైన వ్యాధులను ఈ అత్యాధునిక పీరియడ్ ప్యాడ్ చెప్పగలదని అంటున్నారు.

ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే

శానిటరీ ప్యాడ్‌లో ‘పేపర్-బేస్డ్ లాటరల్ ఫ్లో టెస్ట్ స్ట్రిప్’ ఉంటుంది. ఇది కోవిడ్ రాపిడ్ టెస్ట్ లాగా కనిపిస్తుంది. రుతుక్రమం సమయంలో రక్తం స్ట్రిప్‌కు చేరుకున్నప్పుడు.. ఈ ప్యాడ్ యాంటీబాడీలతో రసాయనికంగా చర్య జరుపుతుంది. స్ట్రిప్ రంగు మారుతుంది. ప్యాడ్ రంగు ముదురుగా ఉంటే.. సంబంధిత వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉందని అర్ధమట. అపుడు ఈ ప్యాడ్ ని ధరించిన వారు తమ ప్యాడ్ కి రంగును చూడటం ద్వారా ఫలితాన్ని అర్థం చేసుకోవచ్చు లేదా స్మార్ట్‌ఫోన్ యాప్‌తో చిత్రాన్ని తీసుకొని AI ద్వారా ఈ రంగుని విశ్లేషించవచ్చు. ఇది సూక్ష్మమైన రంగు తేడాలను కూడా గుర్తిస్తుంది.

మొదటి దశలో MenstruEye 3 ముఖ్యమైన శారీరక సమస్యలను గుర్తించగలదు.. అవి ఏమిటంటే

  1. సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP): శరీరంలో మంటకు సంకేతం
  2. కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్ (CEA): కణితి లేదా క్యాన్సర్ ప్రమాదం
  3. CA-125: ఎండోమెట్రియోసిస్, అండాశయ క్యాన్సర్ మధ్య సంబంధం

ఇది ఎందుకు ముఖ్యమైనదంటే

ఋతు రక్తంలో సిరల రక్తం లాగానే ఆరోగ్య సమాచారాన్ని అందించగల అనేక ప్రోటీన్లు ఉంటాయి. అయినప్పటికీ ఇప్పటివరకు వైద్య పరీక్షలలో ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశారు. మెన్‌స్ట్రుఏఐ ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ రక్తం చాలా విలువైన సమాచారానికి ఆధారమని తాము నిరూపించామని ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన లూకాస్‌ డోస్నన్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి
  1. ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే ఆరోగ్య పరీక్షలు చేసుకోవచ్చు.
  2. సూదులు లేదా ప్రత్యేక రక్త సేకరణ అవసరం లేదు
  3. వ్యాధి ప్రమాదాన్ని త్వరగా గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స ప్రారంభించవచ్చు
  4. మహిళల ఆరోగ్యాన్ని సులభంగా తనిఖీ చేయడం సాధ్యమవుతుంది.

స్మార్ట్‌ శానిటరీ ప్యాడ్స్‌ ప్రారంభ పరీక్షలలో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాత.. ప్రస్తుతం నిజ జీవితంలో ఈ సాంకేతికత ఎంత ప్రభావవంతంగా ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వయసులు, ఆరోగ్య పరిస్థితులలో స్మార్ట్‌ శానిటరీ ప్యాడ్స్‌ తెలియజేసే ఫలితాలు ఎంత ఖచ్చితమైనవో, వినియోగదారు అనుభవం ఎలా ఉంటుందో విశ్లేషించడానికి 100 మందికి పైగా మహిళలతో కూడిన బృందం పై భారీ స్థాయిలో ట్రయల్ జరుగుతోంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం వైద్య సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు. ఋతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక నిషేధాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా. ఋతుస్రావం సిగ్గుచేటు కాదని, మహిళల ఆరోగ్యం గురించి సమాచారం ముఖ్యమైన వనరు అని కూడా శాస్త్రజ్ఞులు అంటున్నారు. మెన్‌స్ట్రుఏఐ మహిళల ఆరోగ్యా విషయం తెలుసుకోవడానికి నొప్పిలేకుండా, ప్రభావవంతమైన మార్గాన్ని అందిస్తుంది. వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో మహిళల ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులు చేయగలదని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)