AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పాల పదార్థాలతో పోలిస్తే రాగిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవటంలో కాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాగులతో చేసిన ఆహార పదార్థాలు బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు.

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Finger Millet
Jyothi Gadda
|

Updated on: Jan 28, 2025 | 10:01 PM

Share

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి, అసంతృప్త కొవ్వులు తక్కువ.

బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహారం. రాగులను మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రాగుల్లో అధికంగా లభించే ఫైబర్​ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు మీ కడపును నిండుగా ఉంచుతుంది. ఫిట్​నెస్​ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. రాగుల్లోని ఫైబర్​ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో పాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇతర జీర్ణ రుగ్మతలను నయం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..