Alcohol: బీర్, బ్రాందీలకు ఎక్స్‌ఫైర్ డేట్ ఉంటుందా..! కొనేటప్పుడు ఈ విషయం తెలుసుకోండి..

Alcohol: మందుబాబులు బహుశా.. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించి ఉండరు. ఎందుకంటే వారికి కావాల్సింది కిక్కు. ఆ కిక్కులో పడి అసలు విషయాన్ని మరిచిపోతున్నారు.

Alcohol: బీర్, బ్రాందీలకు ఎక్స్‌ఫైర్ డేట్ ఉంటుందా..! కొనేటప్పుడు ఈ విషయం తెలుసుకోండి..
Liquor
Follow us

|

Updated on: Oct 12, 2021 | 1:44 PM

Alcohol: మందుబాబులు బహుశా.. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించి ఉండరు. ఎందుకంటే వారికి కావాల్సింది కిక్కు. ఆ కిక్కులో పడి అసలు విషయాన్ని మరిచిపోతున్నారు. మద్యం కొనుగోలు చేసినప్పుడు ఎప్పుడు ఎక్స్‌ఫైర్ డేట్‌ని గమనించి ఉండరు. అసలు మద్యానికి ఎక్స్‌ఫైర్ డేట్‌ ఎలా నిర్ణయిస్తారు. బీర్‌కి, బ్రాందీ, విస్కీలకు ఉన్న తేడాలేంటి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎక్స్‌ఫైర్ డేట్‌ అనేది వైన్ రకం మీద ఆధారపడి ఉంటుంది. రకరకాల మద్యానికి రకరకాలుగా ఉంటుంది. కొన్ని వైన్‌లు తయారు చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు తాగవచ్చు. కొన్ని రకాల వైన్‌లు కొన్ని సంవత్సరాలు కోల్డ్ స్టోరేజీలో ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి మంచి ఆల్కహాల్‌గా తయారవుతాయి. ముందుగా చెప్పాలంటే స్పిరిట్ కేటగిరీలో ఉన్న ఆల్కహాల్‌కు గడువు తేదీ అనేది ఉండదు. అంటే రమ్, జిన్, వోడ్కా, బ్రాందీ, టేకిలా వంటివాటికి ఎక్స్‌ఫైర్ డేట్‌తో పనిలేదు. వాటిని ఎప్పుడైనా తాగవచ్చు. ఇవి అస్సలు చెడిపోవు.

సాధారణంగా వైన్‌, బీర్లకు మాత్రం గడువుతేదీ ఉంటుంది. ఎందుకంటే వీటి తయారీ విధానం ఆ విధంగా ఉంటుంది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండలేవు. అందుకే నిర్దిష్ట సమయంలో తాగడం అవసరం. వైన్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పాడయ్యే అవకాశం ఉంటుంది. గడువు తేదీ వైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక బీర్‌ పరిస్థితి కూడా ఇంచు మించు ఈ విధంగానే ఉంటుంది. దీనికి కచ్చితంగా ఎక్స్‌ఫైర్ డేట్‌ ఉంటుంది. అందుకే చూసి కొనుగోలు చేయాలి. బీర్ మూత తీసిన తర్వాత చాలా రోజులు ఉంటుంది. కానీ నాణ్యతలో తేడా వస్తుంది.

Car Loan: కారులోన్‌ ఎలా ఎంచుకోవాలి..! తీసుకునే ముందు ఈ 5 విషయాలు గమనించండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..