Bathukamma: ప్రపంచానికి తెలిసేలా పూల పండుగ ఖ్యాతి.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట.. ఎప్పుడంటే..?
Burj Khalifa - Bathukamma : తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అందరూ కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే..
Burj Khalifa – Bathukamma : తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అందరూ కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే.. బతుకమ్మ పండుగ ఖ్యాతి ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా.. ఖండాంతరాలు దాటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని.. మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు నడుంబిగించినట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏటా ఏదైనా కొత్త వేడుక నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. దీనిలో భాగంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను పాటను ప్రదర్శించనున్నట్లు కవిత వెల్లడించారు. బతుకమ్మ ఖ్యాతి ప్రపంచమంతటా తెలిసేలా అక్టోబర్ 23వ తేదీన బతుకమ్మను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. తాజాగా.. ‘అల్లిపూల బతుకమ్మ’ పాటకు సంబంధించి నటులు ప్రియదర్శి, రాహుల్ చేసిన ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను ప్రదర్శింనున్నట్లు ఆమె తెలిపారు.
గౌతమ్ మేనన్, ఏఆర్ రెహ్మాన్ సారధ్యంలో అల్లిపూల బతుకమ్మ పాట రూపొందిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించి కవిత, గౌతమ్ మేనన్‌ను నటులు ప్రియదర్శి, రాహుల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసేందుకే అల్లిపూల బతుకమ్మ పాటను గౌతమ్ మేనన్, ఏఆర్ రెహ్మాన్ తో రూపొందించినట్లు కవిత చెప్పారు. ఈ పాట చేశాక.. బతుకమ్మ మీద సినిమా చేసేందుకు గౌతమ్ మేనన్ ఆసక్తి చూపించారని వెల్లడించారు. ఇలాంటి కొత్త ప్రయోగాలతోనే బతుకమ్మ ఖ్యాతి పెరుగుతుందని.. ప్రపంచవ్యాప్తంగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ప్రపంచానికి బతుకమ్మ తెలిసేలా.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. రెండేళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నా కరోనా మహమ్మారి కారణంగా సాధ్యపడలేదని పేర్కొన్నారు.
Also Read: