AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine Factory: తవ్వకాల్లో బయటపడ్డ 1,500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Wine Factory: పురాతన కాలం నాటి మద్యం తయారీ ఫ్యాక్టరీ పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. ఇజ్రాయేల్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఈ ఫ్యాక్టరీ ఆసక్తి కలిగిస్తోంది..

Wine Factory: తవ్వకాల్లో బయటపడ్డ 1,500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Wine Factory
Follow us
Subhash Goud

|

Updated on: Oct 12, 2021 | 1:24 PM

Wine Factory: పురాతన కాలం నాటి మద్యం తయారీ ఫ్యాక్టరీ పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. ఇజ్రాయేల్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఈ ఫ్యాక్టరీ ఆసక్తి కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం తయారీ కేంద్రంగా ఉండేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. టెల్‌ అవీవ్‌కు దక్షిణం వైపునున్న యావ్నే పట్టణం సమీపంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. రెండు సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతుండగా, ఇటీవలే ఈ ఫ్యాక్టరీ బయటపడటంతో శాస్త్రవేత్తలు సోమవారం ఈ విషయాలను వెల్లడించారు. సుమారు 1,500 ఏళ్ల క్రితం ఇక్కడ భారీస్థాయిలో మద్యం తయారీ జరిగినట్టు పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

తవ్వకాల్లో ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు..

ఈ తవ్వకాల్లో మొత్తం ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు, మట్టి పాత్రలు నిల్వ ఉంచే బట్టీలు, వేల సంఖ్యలో జాడీలు, వాటి శకలాలను వెలికితీశారు పరిశోధకులు. వీటన్నింటి ఆధారంగా యావ్నేలో ఏడాదికి 5.3 లక్షల గ్యాలన్లకు పైగా మద్యం తయారయి ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ‘యావ్నే 1,500 ఏళ్ల కిందట ప్రపంచ మద్యం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అయితే ఇది బైజాంటైన్ కాలంలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుందని ఇజ్రాయేల్ పురావస్తు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అధునాతనమై పరిశ్రమ బయట పడటం ఆశ్చర్యమేసింది..

ఈ తవ్వకాల్లో అధునాతనమైన పరిశ్రమ బయటపడటంతో ఆశ్చర్యం వేసిందని, వాణిజ్య పరిమాణంలో ఇక్కడ మద్యం ఉత్పత్తి చేసేవారు అని పురావస్తు నిపుణులైన ఎలై హడాడ్, లియాత్ నాడవ్ జివ్, జోన్ సెలిగ్మన్ చెబుతున్నారు. అందంగా అలంకరించిన శంఖం ఆకారంలో ఉన్న ఈ కేంద్రం.. నాటి యజమానుల సంపదను సూచిస్తుందని అంటున్నారు. ఈ వైన్‌ పరిశ్రమ సామర్ధ్యం ఏడాదికి 2 మిలియన్ లీటర్ల ఉత్పత్తి చేసినట్టు తెలుస్తోంది.. మొత్తం ప్రక్రియ ఎటువంటి మెషీనరీ లేకుండా మనుషులతోనే నిర్వహించిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు. అయితే సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవీ కూడా చదవండి:

6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్‌..!

Wi-Fi Calling: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి..? స్మార్ట్‌ఫోన్‌లలో దీనిని ఎలా ఉపయోగించాలి..?