AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loan: కారులోన్‌ ఎలా ఎంచుకోవాలి..! తీసుకునే ముందు ఈ 5 విషయాలు గమనించండి..

Car Loan: కారులోన్‌ తీసుకోవడానికి ముందుగా సెర్చ్‌ చేయాలి. ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ అనేది పరిశీలించాలి. తక్కువ ఎక్కడ లభిస్తుందో చూడాలి. ఈ ఐదు విషయాలను

Car Loan: కారులోన్‌ ఎలా ఎంచుకోవాలి..! తీసుకునే ముందు ఈ 5 విషయాలు గమనించండి..
Car Loan
uppula Raju
|

Updated on: Oct 12, 2021 | 1:23 PM

Share

Car Loan: కారులోన్‌ తీసుకోవడానికి ముందుగా సెర్చ్‌ చేయాలి. ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ అనేది పరిశీలించాలి. తక్కువ ఎక్కడ లభిస్తుందో చూడాలి. ఈ ఐదు విషయాలను కచ్చితంగా గమనించాలి. అప్పుడే మీకు కారు చౌకగా దొరుకుతుంది. మీపై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. సరైన సమయంలో వాయిదాలు చెల్లించడానికి వీలుగా ఉంటుంది.

1. సరైన ఒప్పందం మీకు ఆర్థిక విషయాలలో ఏ బ్యాంకుతో అయితే ఎక్కువ సంబంధాలు ఉంటాయో ఆ బ్యాంకులో లోన్‌ తీసుకుంటే మంచిది. మీరు అన్ని ఖర్చులు, ఛార్జీలను అంచనా వేయాలి. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పేమెంట్ ఛార్జ్, వడ్డీ రకాన్ని (ఫిక్స్‌డ్ లేదా ఫ్లోటింగ్) చెక్ చేయాలి.

2. ప్రస్తుత బ్యాంకును సంప్రదించండి ఇప్పటికే మీకు తెలిసిన బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం వల్ల మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదా అడ్డంకి ఉండదు. డబ్బు కూడా ఆదా అవుతుంది. కొన్ని బ్యాంకులు తమ ప్రస్తుత కస్టమర్‌లకు కారు రుణంతో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. సెకన్లలో నెట్‌బ్యాంకింగ్ ద్వారా రుణం పొందడం, సున్నా డాక్యుమెంటేషన్, ఆకర్షణీయమైన రేట్లు అందిస్తాయి.

3. కారు అర్హతను తనిఖీ చేయండి చాలా బ్యాంకులు వేర్వేరు అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. కొత్త కార్లు, ఉపయోగించిన కార్ల కోసం ప్రత్యేక నిబంధనలు జారీ చేయబడి ఉంటాయి. సెకండ్‌ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తే మీ బ్యాంక్ దానికి ఆర్థికసాయం అందిస్తుందా లేదా తెలుసుకోండి. కారు రుణం కోసం అర్హతను లెక్కించడానికి వివిధ బ్యాంకులు కారు వయస్సు, మోడల్, కండిషన్ వంటివి పరిగణలోకి తీసుకుంటాయి.

4. మంచి క్రెడిట్ స్కోర్ కారు రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీ క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు అధిక రుణ మొత్తాన్ని పొందుతారు. కారు రుణాలు వేగంగా, మెరుగైన రేట్లలో అందుబాటులో ఉంటాయి.

5. సరైన మొత్తంలో రుణం తీసుకోండి మీరు కారు రుణం తీసుకునే ముందు బ్యాంక్ అధిక డౌన్ పేమెంట్ అడుగుతుందా? ఆన్‌ రోడ్ ధర లేదా ఎక్స్-షోరూమ్ ధరలను తెలుసుకోండి. ఎందుకంటే ఇది మీ కారు రుణ మొత్తంలో పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.

Tirumala – CM Jagan Mohan Reddy: శ్రీవారి సన్నిధిలో పట్టుపంచెలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…