Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..

ఎటువంటి ఆకాంక్షలు లేకుండా అక్టోబర్ 18 నుండి దేశీయ విమాన కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది...

Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..
flights
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 12, 2021 | 5:34 PM

ఎటువంటి ఆకాంక్షలు లేకుండా అక్టోబర్ 18 నుండి దేశీయ విమాన కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో కరోనా విజృంభనతో విమాన సర్వీసులపై గతంలో ఆంక్షలు విధించారు. విమానంలో ప్రయాణం చేయలంటే కోవిడ్‌ నెగటివ్‌ ధృవపత్రం, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన విధించారు. భౌతిక దూరం పాటించాలని విమానంలో ప్రయాణికుల పరిమితిపై ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా వరకు వ్యాక్సిన్ వేయించుకోవడం, కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రయాణికుల పరిమితిపై ఆంక్షలు ఎత్తి వేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో 85 శాతం సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు.

తాజా ఉత్తర్వులతో విమానాల్లో వంద శాతం ప్రయాణికులను అనుమతించనున్నారు. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. మరోవైపు కరోనా మూడో వేవ్‌పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా ఎక్కువగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. చాలా మంది సింగిల్ డోస్ వేసుకుని రెండో వేసుకోకుండా తిరుగుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. మొదటి డోస్ వేసుకున్న వారు కచ్చితంగా రెండో డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also.. Car Loan: కారులోన్‌ ఎలా ఎంచుకోవాలి..! తీసుకునే ముందు ఈ 5 విషయాలు గమనించండి..