Weight Loss: పొట్ట తగ్గించుకునేందుకు ప్రయాత్నిస్తున్నారా ? ఈ 5 రకాల జీరో కేలరీలున్న ఫుడ్ తింటే రిజల్ట్ పక్కా..
ప్రస్తుతం చాలా మందిని వేదిస్తున్న సమస్య ఊబకాయం. ప్రస్తుత యువతలో చాలా మంది పెళ్లి ఈడుకోచ్చే సరికి పోట్ట పెరగడం ద్వారా ఇబ్బంది పడుతున్నాయి. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు
ప్రస్తుతం చాలా మందిని వేదిస్తున్న సమస్య ఊబకాయం. ప్రస్తుత యువతలో చాలా మంది పెళ్లి ఈడుకోచ్చే సరికి పోట్ట పెరగడం ద్వారా ఇబ్బంది పడుతున్నాయి. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల డైట్స్ చేస్తూ అనారోగ్యాల పాలవుతుంటారు. అలా కాకుండా జీరో కేలరీలున్న ఫుడ్ తీసుకోవడం వలన రిజల్ట్ చూడోచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడం కేవలం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి.. ఒకటి మీరు రోజూ తీసుకునే ఆహారం మరియు వ్యాయమం. ఈ రెండింటిలో ఆహారం తీసుకోవడం బరువు తగ్గెందుకు చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని అధ్యయనాల్లో వెల్లడించారు. ముఖ్యంగా బరువు తగ్గడం అంటే శరీరంలో కేలరీల లోటును సృష్టించుకోవడం. బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా కేలరీలను తగ్గించాలి. దీనివలన శరీరంలో ఉండే వ్యర్థ కొవ్వు తగ్గి.. క్రమంగా బరువు తగ్గుతారు.
సామాన్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వలన ఒకేసారి అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు. అంతేకాకుండా శరీరంలో పోషక లోపాలను సృష్టిస్తుంది. అలాంటడప్పుడు తక్కువ కేలరీలున్న ఫుడ్ తీసుకోవడం ఉత్తమం. అలాగే శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అందుకే మీకోసం 5 రకాల జీరో కేలరీలున్న ఆహార పదార్థాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును కరిగించే 5 జీరో కేలరీల ఆహారాలు..
1. సెలెరీ.. సెలెరీ అనేది జీరో కేలరీలున్న ఆహార పదార్థాలలో ఒకటి. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉండగా.. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల ఆహార ఉత్పత్తి చేస్తుండగా.. కేవలం 16 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇది ఎక్కువగా కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి వంటివి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సెలెరీని సలాడ్లు మరియు శాండ్ విచ్ల ద్వారా తీసుకోవచ్చు. 2. బ్రోకలీ.. బ్రోకలీ చాలా ఆరోగ్యకరమైన క్రూసిఫరస్ కూరగాయ. దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్లు, నీరు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో 100 గ్రాములకు 34 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి మరియు నిర్వహించడానికి బ్రోకలీ సహయపడుతుందని అధ్యయనాలు తెలిపాయి. 3. పాలకూర.. పాలకూరను భారతీయ వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. 100 గ్రాములకు 17 కేలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. 4. క్యారెట్లు.. క్యారెట్లు కళ్లు, చర్మం మరియు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, ఈ అధికంగా ఉంటాయి. అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు క్యారెట్ తినడంవలన ఫలితాలను చూడవచ్చు.
Also Read:
Sapota benefits: సపోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..