Sapota benefits: సపోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..

సపోటాలు...ఎక్కువగా తీపి ఉన్న పండు. తీపితోపాటు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఎరువులు వేయాల్సిన పనిలేదు.

Sapota benefits: సపోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2021 | 5:25 PM

సపోటాలు…ఎక్కువగా తీపి ఉన్న పండు. తీపితోపాటు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఎరువులు వేయాల్సిన పనిలేదు. విత్తనాలు వేస్తే సరి.. ఎక్కువ శ్రమ తీసుకోకుండా.. వాటంతటే పెరుగుతాయి. వీటిని ఎక్కువగా సలాడ్స్, జ్యూస్‏ల మాదిరిగా చేసుకుంటుంటారు. అయితే ఈ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

సపోటాలతో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు..

➤ఈ పండ్లలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పనిచేసి అలసిపోయిన వారికి ఇది ఎనర్జిటిక్ ఫ్రూట్‏గా పనిచేస్తుంది. అందుకే అలసటగా అనిపించినప్పుడు.. ఈ పండ్లను తినడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ➤ ఈ పండ్లలో ఉండే విటమిన్ A, C కళ్ళకు మేలు చేస్తాయి. కంటి చూపును కాపాడడంలో సహయపడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు.. శరీరంలోని వ్యర్థాన్ని బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా గుండె సంరక్షణకు తోడ్పడతాయి. ➤ మలబద్ధకం సమస్యకు ఈ పండ్లు తినడం ద్వారా చెక్ పెట్టోచ్చు. రకారకాల స్పైసీ ఫుడ్ తినడం వలన కడుపులో కలిగే సమస్యలను కూడా సపోటాలు తగ్గిస్తాయి. అలాగనీ మరీ ఎక్కువగా ఈ పండ్లను తినకూడదు. గుర్తుపెట్టుకోండి. ➤ ఈ పండ్లలో ఫైబర్, విటమిన్ Bతోపాటూ.. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారించడానికి ఇవి సహయపడతాయి. ➤ శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ సపోటాలను తినడం మంచిది. ఇందులో ఉండే టాన్సిన్.. బాడీలోని వేడిని తగ్గించి.. చలవ చేస్తుంది. వీటిని లిమిట్‏గా తినాలి. ➤ మొటిమలు, మచ్చలను తగ్గించడానికి ఈ సపోటాలు పనిచేస్తాయి. శరీరంలోని వి, వ్యర్థాలను తొలగించి.. చర్మం, జుట్టు సంరక్షణకు తోడ్పడతాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. ➤ ప్రెగ్నెన్సీ స్త్రీలకు ఉదయం నీరసంగా ఉంటుంది. అలాంటి సమయంలో వారు సపోటాలు తినడం వలన.. ఎనర్జీటిక్‏గా ఫీల్ అవుతారు. అలాగే కడుపులో కలిగే సమస్యలను తగ్గిస్తాయి. ➤ బరువు తగ్గడానికి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వారిలో మెటబాలిజం సరిగ్గా ఉండాలి. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు రోజూ రెండు సపోటాలు తిని.. వర్కవుట్ చేసుకుంటే.. ఫలితం కనిపిస్తుంది. ➤ ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం.. రక్తనాళాల్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది. అలాగే పొటాషియం, బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం ఎక్కువగా లేని వారు సపోటాలు తినాలి. ➤ సపోటాల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేందుకు సహయపడతాయి. వీటిలో ఉండే ఫోలేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలెనియం.. ఎముకలను బలంగా ఉంచేందుకు సహయపడతాయి. అయితే సపోటాలను మోతాదుకు మించి తినడం కూడా మంచిది కాదు. షుగర్ పేషెంట్స్ వీటిని తినకపోవడం ఉత్తమం.

Also Read: Health News: రోజూ వీటిని తినడం వలన కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.. అవెంటంటే ?