YSR Statue : ఆత్మకూరులో వైఎస్ విగ్రహంపై దాడి.. విరిగిపడ్డ చేయి.! వైసీపీ నేతల ఆగ్రహం, టీడీపీ పనేనంటూ ఆరోపణ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం అయ్యింది. విగ్రహం కుడి..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ చేయిభాగం విరిగింది. విగ్రహం కుడి చేయి మణికట్టు వరకు విరిగి పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కావాలనే ఎవరో ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో రేపు అమ్మ ఒడి పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉన్నందున జిల్లాలో ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి చర్యకు పాల్పడి ఉంటారని ఇక్కడి వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు అంటున్నారు. స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆత్మకూరు కావడం విశేషం.