Adipurush movie update: అప్పటివరకు షూట్‌కు రానని చెప్పిన సైఫ్ అలీఖాన్.. రీజన్ ఏంటంటే..?
ఆదిపురుష్ షూటింగ్ స్టార్ట్ అయినా నేను మాత్రం ఇప్పుడే రానని చెప్పేస్తున్నారు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. ఈ మూవీలో సైఫ్‌దే మెయిన్ లీడ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది బాలీవుడ్ మీడియా.
Adipurush movie update: ఆదిపురుష్ షూటింగ్ స్టార్ట్ అయినా నేను మాత్రం ఇప్పుడే రానని చెప్పేస్తున్నారు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. ఈ మూవీలో సైఫ్‌దే మెయిన్ లీడ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది బాలీవుడ్ మీడియా. అయితే, తాజాగా ఆదిపురుష్ టీంకు షాక్ ఇచ్చారు సైఫ్ అలీఖాన్.. మార్చి వరకు షూటింగ్‌కు వచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. ప్రస్తుతం సైఫ్ భార్య కరీనా కపూర్ ప్రెగ్నెంట్. జనవరిలో ఈ జంట రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ టైంలో షూటింగ్‌లు చేయటం కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యారట సైఫ్. కరీనా డెలివరీ తరువాత మరో రెండు నెలలు ఆమెతోనే ఉండి ఆ తరువాతే షూటింగ్‌లకు వెళ్లాలన్నది సైఫ్ ప్లాన్. అందుకే మార్చి ఎండ్ వరకు ఆదిపురుష్‌కు డేట్స్ లేవని చెప్పేశారు సైఫ్.
ఈ నెల 19 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ ఓంరౌత్. అయితే ముందుగా ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో ఆదిపురుష్ కోసం భారీ గ్రీన్‌మ్యాట్ సెట్‌ను రెడీ చేశారు. ఆ సెట్‌లోనే మేజర్ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఓం రౌత్.
Also Read:
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి
Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 351 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా