వర్క్ ఫ్రం హోంతో వర్చువల్.. వేధింపులు

వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఉద్యోగులపట్ల వేధింపులు పెరుగుతున్నాయి. సంస్థలు వారి అంతర్గత విధానాలను సమీక్షల పేరుతో కొందరు వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

వర్క్ ఫ్రం హోంతో వర్చువల్.. వేధింపులు
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2020 | 7:09 PM

కరోనా వైరస్ ప్రభావంతో జీవనస్థితిగతులే మారిపోయాయి. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే అయా కంపెనీలు తమకార్యకలాపాలను ఉద్యోగుల ఇంటి నుంచి నిర్వహించేలా చర్యలు చేపట్టాయి. దీంతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఉద్యోగులపట్ల వేధింపులు పెరుగుతున్నాయి. సంస్థలు వారి అంతర్గత విధానాలను సమీక్షల పేరుతో కొందరు వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

ఓ మేనేజర్ ఒక మహిళతో వర్చువల్ సమావేశానికి షర్ట్‌లెస్‌గా కనిపిస్తాడు. మరొక సందర్భంలో ఒక ఉద్యోగి తన మహిళా సహోద్యోగి యొక్క స్క్రీన్ షాట్లను తీసుకుంటాడు. ఇంకొక మేనేజర్ తన సహోద్యోగి అయిన మహిళను రాత్రి 11 గంటలకు సమావేశానికి హాజరుకావాలని పట్టుబడతాడు. పైగా, ఆమెను తన వీడియోను ఆన్ చేయమని పట్టుబడతాడు. ఆమె నిరాకరించడంతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. దీంతో తలెత్తుతున్న సమస్యలతో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.

కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గత నాలుగునెలలుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ తో ప్రముఖ సంస్ధలు అన్ని కూడా మూతపడ్డాయి. దీంతో చాలా వరకు ఉద్యోగులు అందరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. లాక్ డౌన్ విధించటానికి ముందు నుంచే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేశాయి. దాదాపు మార్చి నుండి కోవిడ్ -19 ప్రభావరంతో లాక్ డౌన్ ఇంటిని కార్యాలయంగా మార్చేసింది. ఇదే కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు వేధింపులు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్క్ ఫ్రం హొంతో కొత్త సవాళ్లు కూడా వచ్చిపడ్డాయి.

దేశవ్యాప్తంగా వర్చువల్ వేధింపుల జరుగుతున్నట్లు ఫిర్యాదులు పెరుగాయి. ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నారు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల మానసిక స్థితులపై గార్ట్నర్ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 88% సంస్థలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ప్రోత్సహించాయి. దాదాపు 75% మంది తమ మునుపటి ఆన్‌సైట్ శ్రామికశక్తిలో కనీసం 5% మందిని కోవిడ్ 19 తరువాత శాశ్వతంగా రిమోట్ స్థానాలకు తరలించాలని యోచిస్తున్నారు. అయితే, కంపెనీలు కార్యాలయంలో మాదిరగిగా ఉద్యోగులపపట్ల ఉన్నతాధికారుల వేధింపులు యధావిధిగా ఉన్నాయని సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. లాక్ డౌన్ అయినప్పటి నుండి తమ సంస్థకు వర్చువల్ వేధింపుల సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయని చెన్నైకి చెందిన హెచ్ఆర్ ప్రతినిధి ఒకరు తెలిపారన్నారు. దీంతో గత కొన్ని నెలలుగా కంపెనీలతో రిమోట్ వర్క్ కల్చర్ కోసం లైంగిక వేధింపుల నివారణ (POSH) సెన్సిటైజేషన్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించామని వివరించారు. శిక్షణలో భాగంగా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుతో పాటు డ్రెస్ కోడ్ పై కూడా సూచనలు చేస్తామని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కోవిడ్ 19 తో ఉద్యోగ అభద్రత భావం వల్ల మరింత వేధింపులకు దారితీస్తుందని గార్ట్నర్ సంస్థ సర్వేలో వెల్లడైంది.

POSH అంటే ఏమిటి?

లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 డినెస్ వేధింపులను POSH అంటారు. ఏదైనా ఇష్టంలేకుండా లైంగికంగా వేధించడం, శారీరకంగా, మానసికంగా మాటలతో అసభ్యంగా ప్రవర్తనను వర్చువల్ వేధింపులకు పాల్పడడాన్ని POSHగాభావిస్తారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు, అర్థరహిత ఎమోజీలు, సందేశాలు; స్టాకింగ్, భౌతికంగా, వర్చువల్ పనితీరు రేటింగ్‌ల గురించి బెదిరించడం, అర్థరాత్రి సమయంలో మీటింగ్స్ పేరుతో వీడియో కాల్స్ చేయడం కూడా ఇందులోకే వస్తాయి. మానసిక స్థితిని భంగం కలిగించేలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, సెక్సిస్ట్ జోకులు, వీడియో కాల్స్ సమయంలో డ్రెస్ కోడ్‌ను పాటించకపోవడం POSH చట్ట పరిధిలోకి వస్తాయి. ఇలాంటి సందర్భాలలో సంస్థ మేనేజ్ మెంట్ దృష్టికి గానీ, సైబర్ క్రైమ్ పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చు.

భారతదేశంలో లైంగిక వేధింపుల విధానాల రీచ్ అండ్ ఇంపాక్ట్ పై గ్లోబల్ రీసెర్చ్ సంస్థ 2019 సర్వే నిర్వహించింది. కంపెనీలలో లింగ వైవిధ్య నిష్పత్తిపై అధ్యయనం చేసింది. అయా కార్యాలయాల్లో 56% మంది వేధింపులు గురవుతున్నారని సంస్థ అభిప్రాయపడింది. ప్రధానంగా బెంగళూరు, ముంబై, చెన్నై న్యూఢిల్లీలోని 80 సంస్థలకు చెందిన 200 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. శారీరక వేధింపుల విషయానికి వస్తే చాలామంది ముందుకు రావడానికి ఇష్టపడటం లేదని వివరించింది. తమ సర్వేలో, సగానికి పైగా మహిళలు జోకులు, హావభావాలు మరియు వ్యాఖ్యల రూపంలో లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడైంది. 80% మంది లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా విధానాల గురించి తమకు తెలుసని, 30% మంది ఫిర్యాదు చేయడానికి వెనుకాడతారని అధ్యయనంలో తేలింది.

అయితే, నిపుణులు మాత్రం ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. టెక్స్ట్ మెసేజ్ చేసే విషయంతో సహా హద్దులను దాటకుండా సున్నితంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వర్క్ ఫ్రం హోం సందర్భంగా జరిగే వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని న్యాయవాదులంటున్నారు. ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదులపై అనేక సంస్థలు విచారణలను నిలిపివేస్తున్నాయని, మరికొందరు ఆన్‌లైన్‌లో విచారణ నిర్వహిస్తున్నారని నిపుణులు తెలిపారు. అయితే ఇంటి నుండి పని చేయడం కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. సంస్థలు ఎప్పడు కూడా లైంగిక వేధింపుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వదని.. ప్రపంచంలో వేధింపుల గురించి ప్రజలను చైతన్యపరచడమే ఉత్తమ మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.