తమిళనాడులో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 54 మంది మృతి
తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడులో ఈ రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఇవాళే 3,940 మందికి కరోనా వైరస్ సోకినట్టు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్ధారణ చేసింది. అలాగే షాకింగ్‌కి గురి చేస్తూ ఒక్క రోజే ఏకంగా 54 మంది..
తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడులో ఈ రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఇవాళే 3,940 మందికి కరోనా వైరస్ సోకినట్టు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్ధారణ చేసింది. అలాగే షాకింగ్‌కి గురి చేస్తూ ఒక్క రోజే ఏకంగా 54 మంది మరణించారు. ఈ కొత్త కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 82 వేలు దాటాయి కరోనా కేసులు. ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా 82,275 మంది కోవిడ్ కేసులు నమోదవ్వగా, ఈ మహమ్మారి కారణంగా 1o25 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ప్రస్తుతం 33,216 యాక్టీవ్ కేసులు ఉండగా, 44,094 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక చెన్నై మహానగరంలో కరోనా పాజిటివ్ కేసులు 53 వేలు దాటాయి. ఈ రోజు 1,992 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో చెన్నైలో 53,762కి చేరింది కరోనా కేసుల సంఖ్య.
Read More:
బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్
బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..
అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..