ఢిల్లీలో రికార్డుస్థాయిలో 2,889 మందికి కరోనా
ఢిల్లీలో కొత్తగా 2,889 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 83,077కు చేరుకుంది. కొవిడ్ బారిన పడి ఆదివారం 65 మంది మరణించినట్లు పేర్కొంది.
దేశంలో కరోనా విజృంభణ ఉపందుకున్నట్లు కనిపిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అటు దేశ రాధాని ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా వైరస్ ధాటికి గురికాక తప్పడంలేదు. ఇవాళ కొత్తగా 2,889 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 83,077కు చేరుకుంది. కొవిడ్ బారిన పడి ఆదివారం 65 మంది మరణించినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 2,623 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం కరోనాను జయించి 52,607 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక వివిధ ఆస్పత్రుల్లో 27,847 మంది చికిత్స పొందుతున్నారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.