విడాకులకు కారణమైన బర్గర్

అబుదాబీకి చెందిన ఓ మహిళ బర్గర్ తీసుకురాలేదన్న కారణ‌౦తో తన భర్తకు విడాకులివ్వడానికి సిద్ధపడింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మని ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తకు చెప్పింది. స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేసిన భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మర్చిపోయి ఇంటికి వచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇక తన భర్తకు విడాకులివ్వడమే సరైన నిర్ణయమనుకున్న మహిళ ఓ లాయర్‌ ద్వారా విడాకులకు అప్లై చేసింది. పెళ్లికి ముందు ఉన్నట్లే […]

విడాకులకు కారణమైన బర్గర్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:16 PM

అబుదాబీకి చెందిన ఓ మహిళ బర్గర్ తీసుకురాలేదన్న కారణ‌౦తో తన భర్తకు విడాకులివ్వడానికి సిద్ధపడింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మని ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తకు చెప్పింది. స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేసిన భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మర్చిపోయి ఇంటికి వచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇక తన భర్తకు విడాకులివ్వడమే సరైన నిర్ణయమనుకున్న మహిళ ఓ లాయర్‌ ద్వారా విడాకులకు అప్లై చేసింది.

పెళ్లికి ముందు ఉన్నట్లే ఆ తరువాత కూడా ఉంటుందని చాలా మంది వధూవరులు అనుకుంటున్నారని, దీని వల్లే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయని లాయర్ వివరి౦చారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళకు, ఆమె భర్తకు జడ్జి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని, సమస్య పరిష్కారమైతే వారిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతారని, లేకపోతే ఆమె కోరుకున్నట్టుగా విడాకులు తీసుకోవచ్చన్నారు.