పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా పాకిస్థాని జర్నలిస్ట్ పోస్ట్స్

పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా పాకిస్థాని జర్నలిస్ట్ పోస్ట్స్

ఇస్లామాబాద్‌:   ఇండియా, పాకిస్థాన్ ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రధానమంత్రి మొదలుకొని కామన్ మాన్ వరకు అందరిలోను ఆవేశం లావాలా పెళ్లుబికుతుంది. పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  ఇలాంటి సమయంలో ప్రత్యర్ధి దేశం గురించి తమ దేశాలకు సంభందించిన వారు సానుభూతిగా మాట్లాడినా వాళ్లపై కూడా ప్రజలు ఆగ్రాహావేశాలు చూపిస్తున్నారు. దానికి పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్ధూ వాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే పుల్వామా ఉగ్రదాడి ఒక […]

Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:25 PM

ఇస్లామాబాద్‌: 
 ఇండియా, పాకిస్థాన్ ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రధానమంత్రి మొదలుకొని కామన్ మాన్ వరకు అందరిలోను ఆవేశం లావాలా పెళ్లుబికుతుంది. పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  ఇలాంటి సమయంలో ప్రత్యర్ధి దేశం గురించి తమ దేశాలకు సంభందించిన వారు సానుభూతిగా మాట్లాడినా వాళ్లపై కూడా ప్రజలు ఆగ్రాహావేశాలు చూపిస్తున్నారు. దానికి పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్ధూ వాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ.
అయితే పుల్వామా ఉగ్రదాడి ఒక పాకిస్థాని మహిళా జర్నలిస్టును కదిలించింది. పదుల సంఖ్యలో సైనికుల మరణాలు ఆమె చూసి కన్నీరు పెట్టింది. ఆమె పేరే సెహీర్‌ మీర్జా. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగింది ఆ  అమ్మాయి. అయినా కూడా  పెద్ద సంఖ్యలో సైనికులను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె బాహాటంగానే చెబుతోంది. అంతేనా.. భారత్‌కు మద్దతుగా ‘యాంటీ హేట్‌ చాలెంజ్‌’ను చేపట్టింది.
‘దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. దాని కింద.. ‘నేను పాక్‌ అమ్మాయిని.పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అనే ప్లకార్డుతో ఉన్న తన ఫొటోను పోస్ట్‌ చేసింది. భారత్‌కు మద్దతుగా తాను చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని ఆమె అందరినీ కోరుతోంది. ఆమె స్ఫూర్తితో పాక్‌లో చాలామంది మన దేశానికి బాసటగా నిలుస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్‌ మీర్జా పోరాడుతోంది. నిజంగా కాసేపు ఎమోషన్‌ని పక్కనబెట్టి ఇంటిలిజెన్స్‌తో ఆలోచిస్తే సెహీర్ మీర్జా థాట్‌కి సెల్యూట్ చేయాల్సిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu