పాక్ తో ఇక నో క్రికెట్… ఐపీఎల్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని కేంద్రం అనుకుంటోంది. అటు పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లో ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ని కూడా రద్దు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ చైర్మన్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇక ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అంగీకారం లేకుండా పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తి […]

పాక్ తో ఇక నో క్రికెట్... ఐపీఎల్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:37 PM

పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని కేంద్రం అనుకుంటోంది. అటు పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లో ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ని కూడా రద్దు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ చైర్మన్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇక ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అంగీకారం లేకుండా పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తి లేదని చెప్పారు. పుల్వామా దాడి నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘ ఈ పరిణామాలు క్రీడలతో సంబంధం లేకపోయినా.. ఎవరైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, దాని ప్రభావం ఖచ్చితంగా క్రీడలపై ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి అండగా ఉండడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ఇకపోతే పుల్వామా దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్- ఇ-మహ్మద్ ప్రకటించుకుంది.