AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే..!

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర ఘటన తర్వాత దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఈ దాడి వెనక ఉన్నది పాకిస్థానే అనే విషయం తొదరగానే అర్ధమైపోయింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏదొకటి చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతంది. దెబ్బకు దెబ్బ తీయాలని, ప్రతీకారం తీర్చుకోవాలనే కామెంట్లు సగటు భారతీయుడి నుంచి సెలబ్రిటీల వరకూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో భారత్‌పై ఉగ్రదాడికి తెగబడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ […]

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే..!
Vijay K
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:34 PM

Share

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర ఘటన తర్వాత దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఈ దాడి వెనక ఉన్నది పాకిస్థానే అనే విషయం తొదరగానే అర్ధమైపోయింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏదొకటి చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతంది. దెబ్బకు దెబ్బ తీయాలని, ప్రతీకారం తీర్చుకోవాలనే కామెంట్లు సగటు భారతీయుడి నుంచి సెలబ్రిటీల వరకూ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో భారత్‌పై ఉగ్రదాడికి తెగబడ్డ పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఆ సమయంలో పాక్ ఎదురు తిరగకుండా సర్జికల్ స్ట్రైక్స్ అస్సలు జరగలేదని పాక్ ప్రజలకు సర్ధి చెప్పుకుంది.

అయితే మరి ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ మేరకు ఒకవేళ యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉండనుంది..? బలాబలాల పరంగా చూస్తే భారత్ కన్నా పాకిస్థాన్ చాలా వెనబడి ఉంది. రక్షణ రంగానికి భారత్ కేటాయించే బడ్జెట్ కన్నా పాకిస్థాన్ బడ్జెట్ ఐదు రెట్టు తక్కువ. ఇది పక్కన పెడితే అసలు ఆర్ధికపరంగా పాకిస్థాన్ బలంగానే లేదు. చాలా వీక్‌గా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దివాళ దిశగా ఉందని చెప్పక తప్పదు. మంత్రులు వాడే కార్లు, ఇతర ఖర్చులను కూడా తగ్గించుకునే పరిస్థితిలో ఉంది.

మరి ఈ స్థితిలో బలంగా ఉన్న భారత్‌తో పాకిస్థాన్ యుద్ధం చేయడం పాక్‌కే చాలా నష్టం. అయితే పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే భారత్‌కు నష్టమే కానీ భారత్ అంతకంటే ఎక్కువగానే అణ్వాయుధ దాడి చేసే చాన్స్ ఉంది. పాకిస్థాన్‌కు ఒక పెద్ద అండ ఉంది. అదే చైనా. శత్రువుకు శత్రువు మిత్రుడౌతాడనే సామెత ఇక్కడ కరెక్ట్‌గా పని చేస్తుంది.

భారత్‌కు చైనాకు పడదు కాబట్టే పాకిస్థాన్‌కు చైనా కావాలనే సహాయం చేస్తుందనే వాదనలున్నాయి. అయితే దొడ్డిదారిలో సహాయం చేస్తుందేమో కానీ నేరుగా మాత్రం కలగజేసుకోదు. ఎందుకంటే చైనాకు భారత దేశమే అతిపెద్ద మార్కెట్. భారత్ గనక చైనా వస్తువులను బ్యాన్ చేస్తే ఇక ఆ దేశం ఆర్ధికపరంగా బాగా నష్టపోతుంది.

ఆ విషయం తెలిసే చైనా ఆచితూచి అడుగులు వేస్తుంది. పాకిస్థాన్‌కు నేరుగా సహకరించదు. దీంతో భారత్, పాక్‌ల మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే అది పాకిస్థాన్‌కు తీరని నష్టమే అవుతుంది. మరి పాకిస్థాన్‌ యుద్ధానికి దిగనప్పుడు భారత్ ముందడుగు వేస్తే అంతర్జాతీయ వేదికపై నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.