బీజేపీ-శివసేన సంచలన నిర్ణయం

బీజేపీ-శివసేన సంచలన నిర్ణయం

ముంబై: బీజేపీ-శివసేన గత మూడేళ్లుగా గొడవలు పడుతూనే నెట్టుకొచ్చాయి. ఎన్డఏలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీపై శివసేన విమర్శలు చేస్తుండేది. భాగస్వామి పార్టీయే నేరుగా విమర్శులు చేస్తుండటంతో బీజేపీకి అది చాలా ఇబ్బందికరంగా ఉండింది. అయితే ఇప్పుడు అదంతా సర్దుమణిగిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నం ఫలించింది. తాజాగా జరిగిన చర్చల్లో భాగంగా ఇరు పార్టీలు మహారాష్ట్రలో సగం సగం సీట్లలో పోటీ చేసేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో విడిపోతాయనుకున్న పార్టీలు రేపు రాబోతున్న […]

Vijay K

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:29 PM

ముంబై: బీజేపీ-శివసేన గత మూడేళ్లుగా గొడవలు పడుతూనే నెట్టుకొచ్చాయి. ఎన్డఏలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీపై శివసేన విమర్శలు చేస్తుండేది. భాగస్వామి పార్టీయే నేరుగా విమర్శులు చేస్తుండటంతో బీజేపీకి అది చాలా ఇబ్బందికరంగా ఉండింది. అయితే ఇప్పుడు అదంతా సర్దుమణిగిపోయింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నం ఫలించింది. తాజాగా జరిగిన చర్చల్లో భాగంగా ఇరు పార్టీలు మహారాష్ట్రలో సగం సగం సీట్లలో పోటీ చేసేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో విడిపోతాయనుకున్న పార్టీలు రేపు రాబోతున్న ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పాయి. ఇది ఒకరకంగా అందరికీ షాక్‌ను కలిగించే విషయమే.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు.

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇరు పార్టీల పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu