కరుడుగట్టిన ఉగ్రవాది ఒక్క దెబ్బకే వణికిపోయాడు: భారత ఆర్మీ అధికారి

కరుడుగట్టిన ఉగ్రవాది ఒక్క దెబ్బకే వణికిపోయాడు: భారత ఆర్మీ అధికారి

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ఆ దాడి చేసింది తామే అని పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు బాస్ మసూద్ అజహర్. ఇతని ప్రమేయం ఒక్క పుల్వామా ఉగ్రదాడికి సంబంధించే కాకుండా ఇప్పటి వరకూ భారత్‌లో జరిగిన పలు దాడుల్లో ఉంది. భారత్‌పై తెగబడి దాడులు చేయడం, ప్రాణాలు తీయడం ఒక్కటే ఇతని అజెండా. ఇంత కరుడు గట్టిన ఈ ఉగ్రవాది గురించి పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత […]

Vijay K

| Edited By:

Oct 18, 2020 | 8:39 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ఆ దాడి చేసింది తామే అని పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు బాస్ మసూద్ అజహర్. ఇతని ప్రమేయం ఒక్క పుల్వామా ఉగ్రదాడికి సంబంధించే కాకుండా ఇప్పటి వరకూ భారత్‌లో జరిగిన పలు దాడుల్లో ఉంది. భారత్‌పై తెగబడి దాడులు చేయడం, ప్రాణాలు తీయడం ఒక్కటే ఇతని అజెండా. ఇంత కరుడు గట్టిన ఈ ఉగ్రవాది గురించి పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ అధికారి ఒకరు సంచలన విషయలు వెల్లడించారు.

1994లో ఒకసారి పోర్చుగీసు పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదగా భారత్‌లోకి ప్రవేశించిన మసూద్ అజహర్‌ను భారత ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం అప్పుడు ఒక ఆర్మీ అధికారి లాగిపెట్టి చెంప మీద కొట్టగానే మసూద్ వణికిపోయాడట. వెంటనే అడిగినవి, అడగనివి కూడా అన్నీ చెప్పాసేడట. బయటకు మసూద్ కరుడుగట్టిన ఉగ్రవాదే కావొచ్చు కానీ లోపల మాత్రం చాలా పిరికివాడని ఆ ఆర్మీ అధికారి వివరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu