Winter Care Tips: చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..
చలికాలంలో స్నానం చేయడానికి కొంతమంది బద్దకిస్తారు. అదే సమయంలో కొంతమంది వేడి నీరుతో స్నానం చేస్తారు. మరికొందరు చలి కాలంలో చన్నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే కొంతమంది అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చల్లటి నీళ్లతో స్నానం చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో చాలా మంది చల్లటి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల శరీరం తాజాదనంతో ఉంటుందని భావిస్తారు. అయితే ఈ అలవాటు కొంతమంది ఆరోగ్యానికి ప్రమాదకరం. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దాని గురించి తెలుసుకుందాం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఈ సమయంలో మెదడులోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ అందదు. అప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. సకాలంలో చికిత్స అందించక పొతే అప్పుడు వ్యక్తి మరణానికి దారితీస్తుంది. చల్లటి నీరు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో నిపుణులు చెప్పారు.
చల్లని నీరు బ్రెయిన్ స్ట్రోక్‌కి ఎలా కారణమవుతుందంటే
చల్లటి నీటిని నేరుగా తలపై పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. దీని కారణం ఏమిటంటే.. నేరుగా తలపై చల్లటి నీటిని పోసుకున్నప్పుడు మెదడులోని సిరలు అకస్మాత్తుగా కుంచించుకుపోతాయని.. అప్పుడు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. అంతే కాదు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. అప్పుడు శరీరంలో బలహీనత, అలసట, తల తిరగడం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చె అవకాశం ఉంది.
ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ పద్ధతిని అనుసరించండి.
చల్లటి నీళ్లతో స్నానం చేసేటప్పుడు నేరుగా తల మీద చల్లని నీరు పోసుకోకుండా.. ముందుగా చేతులు, కాళ్లు, వీపు వంటి ఇతర భాగాలపై పోసుకోవడం సురక్షితం. ఇలా చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. క్రమంగా చల్లని నీరుతో తలకు స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చల్లటి నీరు తో స్నానం చేయడం వలన శరీరంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది సురక్షితమైన పద్దతి..
ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులు జాగ్రత్త వహించాలి
ఎవరికైనా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నా లేదా జలుబుతో ఇబ్బంది పడుతుంటే చల్లటి నీటితో స్నానం చేయవద్దు. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు చన్నీటితో స్నానం చేస్తే జలుబు, జ్వరం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు అధిక రక్తపోటు లేదా గుండె జబ్బుల సమస్య ఉన్నా.. చల్లటి నీటితో స్నానం చేయడం ప్రమాదకరం. కనుక ఆరోగ్యానికి అనుగుణంగా చల్లటి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోమ్మని డాక్టర్ అజయ్ కుమార్ సూచిస్తున్నారు. చల్లటి నీరు ఎవరి వంటికి అయినా సరిపోకపోతే.. చన్నీటితో స్నానం చేయకండి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయమని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)