పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన..?
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన అల్లర్లలో బీజేపీకి చెందిన నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. దీనితో ఆ హత్యలకు కారణం మీరంటే మీరంటూ ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇది ఇలా ఉండగా బెంగాల్ లో […]
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన అల్లర్లలో బీజేపీకి చెందిన నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. దీనితో ఆ హత్యలకు కారణం మీరంటే మీరంటూ ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇది ఇలా ఉండగా బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందంటూ.. ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాధ్ త్రిపాఠి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇకపోతే రాష్ట్రంలో శనివారం చోటుచేసుకున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. అటు మోదీ కూడా బెంగాల్ అల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆయన్ని కూడా గవర్నర్ కలిశారు. ఆయన ఇద్దరినీ కలిసిన అనంతరం బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉండవచ్చంటూ మీడియాకు వెల్లడించారు. అయితే రాష్ట్రపతి పాలన విధించే అంశం గురించి ప్రధానితో గానీ, హోంమంత్రితో గానీ చర్చినలేదని.. కేవలం బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల గురించి మాత్రమే వివరణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.