దేశ రాజధానిని వణికిస్తున్న సూరీడు
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తర భారతదేశం మీదుగా వీస్తున్న వడగాలులతో ఢిల్లీలో సోమవారం రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్నేళ్లుగా పోల్చుకుంటే జూన్ నెలల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే ఎక్కువ అని చెప్పవచ్చు. సాధారణంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలుండే తొలి 11 ప్రాంతాలు భారత్ లోనే ఉన్నట్లు తాజా సర్వే ప్రకటించింది.