IND vs PAK T20 World Cup 2021 Match Prediction: ఇది మ్యాచ్ మాత్రమే కాదు.. అంతకుమించి.. దాయాదుల పోరులో రికార్డులెలా ఉన్నాయంటే?

Today Match Prediction of India vs Pakistan:ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులో భాగంగా రెండో మ్యాచులో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తలపడనున్నాయి. ఈ రెండు టీంలు ఇదే మ్యాచుతో టీ20 ప్రపంచ కప్‌లో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి.

IND vs PAK T20 World Cup 2021 Match Prediction: ఇది మ్యాచ్ మాత్రమే కాదు.. అంతకుమించి.. దాయాదుల పోరులో రికార్డులెలా ఉన్నాయంటే?
India Vs Pakistan, T20 World Cup 2021
Follow us

|

Updated on: Oct 24, 2021 | 4:41 PM

IND vs PAK T20 World Cup 2021 Match Prediction: ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులో భాగంగా రెండో మ్యాచులో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తలపడనున్నాయి. ఈ రెండు టీంలు ఇదే మ్యాచుతో టీ20 ప్రపంచ కప్‌లో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ అత్యధిక విజయాలతో నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో భారత్ ఓడిపోలేదు. అలాగే భారత్ ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో విజయం సాధించింది. అలాగే పాకిస్తాన్ మాత్రం ఒక మ్యాచులో విజయం సాధించి, మరో మ్యాచులో ఓడిపోయింది.

IND vs PAK, T20 Head to Head Records: టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. గత ఐదు మ్యాచుల్లో భారత్ 4, పాకిస్తాన్ 1 మ్యాచుల్లో విజయం సాధించాయి. మొత్తంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో భారత్ 7 , పాకిస్తాన్ 1 మ్యాచులో విజయం సాధించాయి.

IND vs PAK, టీ20 వరల్డ్ కప్ 2021 మ్యాచులో కీలక ఆటగాళ్లు: టీమిండయా ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకం కానుండగా, పాకిస్తాన్ తరపున బాబర్ అజం, షాహీన్ అఫ్రిదీ ఆకట్టుకోనున్నారు.

IND vs PAK, టీ20 వరల్డ్ కప్ 2021 మ్యాచులో ఎవరెవరి మధ్య పోరు ఉండనుంది: బాబర్ అజామ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే షహీన్ అఫ్రిదీ వర్సెస్ రోహిత్ శర్మ మధ్య పోరు కీలకంగా ఉండనుంది.

IND vs PAK, టీ20 వరల్డ్ కప్ 2021, ఎప్పుడు, ఎక్కడ: అక్టోబర్ 24న, 2021 ఆదివారం నాడు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది.

IND vs PAK, టీ20 వరల్డ్ కప్ 2021, ప్రత్యక్ష ప్రసారం, స్ట్రీమింగ్ వివరాలు: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అలాగే డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లోనూ లైవ్ మ్యాచును చూడొచ్చు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లైవ్ మ్యాచ్ స్కోర్, బ్లాగ్‌ను ఇక్కడ చూడండి

పిచ్: టాస్ గెలిచిన తర్వాత ఛేజింగ్ ఎంచుకునేందుకే కెప్టెన్లు మొగ్గు చూపునున్నారు. ఈ నిర్ణయానికి డ్యూ మరొక ప్రధాన సహకారం అందించే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు (CSK) గెలిచినప్పటికీ, ఐపీఎల్ 2021లో 13 గేమ్‌లలో ఛేజింగ్ చేసిన టీం 9 సార్లు విజయం సాధించాయి. విరాట్ కోహ్లీ షార్జాను మినహాయించి, దుబాయ్, అబుదాబిలోని పిచ్‌లు ఐపీఎల్ కంటే బాగా సహకరిస్తాయని సూచించాడు. ఈ వేదికపై ఐపీఎల్‌లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 156గా నమోదైంది.

ఇండియా కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా వార్మప్‌లో వెన్ను సమస్యతో బాధ పడినట్లు అనిపించింది. కానీ, ఆందోళనకు హామీ ఇవ్వడం తీవ్రమైనది కాదు. ఛేజింగ్‌లోనూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాటింగ్‌ చేశాడు.

ఫఖర్ జమాన్ చరిత్ర, సన్నాహకంలో ఫామ్‌ను కలిగి ఉండడంతో నం.3లో కీలకం కానున్నాడు. దీంతో అశ్విన్‌ను ఆయనకు వ్యతిరేకంగా బరిలోకి దించే అవకాశం ఉంది. అలాగే టోర్నమెంట్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ రహస్యాన్ని కూడా అలాగే ఉంచారు. హార్దిక్ పాండ్య ఇంకా బౌలింగ్ చేయకపోవడంతో, కోహ్లీ తన ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో రంగంలోకి దిగే అవకాశం ఉంది.

భారత్ ప్లేయింగ్ XI అంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్: పాకిస్తాన్ టీం ఇప్పటికే భారత్‌తో ఆడబోయే 12 మంది సభ్యులతో గల టీంను ప్రకటించింది. సర్ఫరాజ్ అహ్మద్, మహ్మద్ వసీమ్, మహ్మద్ నవాజ్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది.

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ అజామ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్/హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది

మీకు తెలుసా?

– పాకిస్థాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇంతవరకు ఔట్ కాలేదు. గత మూడు మ్యాచుల్లో 78*, 36*, 55* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

– ఎండీ. రిజ్వాన్ (1462 పరుగులు, 133.4 స్ట్రైక్ రేట్‌), బాబర్ అజమ్ (1363 పరుగులు, 134.7 స్ట్రైక్ రేట్‌) 2021 లో టీ 20 ల్లో అత్యధిక పరుగులు సాధించారు.

– టీ20ల్లో జులై 2019 నుంచి పరిశీలిస్తే నేరుగా సూపర్ 12 నేరుగా అర్హత సాధించిన టీంలతో పోల్చినప్పడు పాకిస్తాన్ టీం సిక్సులు కొట్టిన శాతం (24.9) గా చాలా చెత్తగా రికార్డయింది.

స్క్వాడ్‌లు: భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ , వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హైదర్ అలీ

Also Read: SL vs BAN T20 World Cup 2021 Match Prediction: లంకపై బంగ్లా టైగర్స్ గర్జించేనా.. ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

World Biggest Bat: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాటట్‌.. ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్..