Europe Airport: విమానాలను రక్షించుకోడానికి పందుల సాయం..! ఆమ్‌స్టర్‌డామ్‌ స్కిఫోల్‌ ఎయిర్‌పోర్టు.. (వీడియో)

Europe Airport: విమానాలను రక్షించుకోడానికి పందుల సాయం..! ఆమ్‌స్టర్‌డామ్‌ స్కిఫోల్‌ ఎయిర్‌పోర్టు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 24, 2021 | 8:16 AM

ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయం యూరప్‌లోనే మూడవ అతిపెద్ద విమానాశ్రయం. ఎయిర్ కార్గో ఫెసిలిటీతో ఉన్న మేజర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ ఎయిర్ఈ పోర్ట్ ఇప్పుడు ఒక వింత సమస్యను ఎదుర్కొంటుంది.

Europe Airport: ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయం యూరప్‌లోనే మూడవ అతిపెద్ద విమానాశ్రయం. ఎయిర్ కార్గో ఫెసిలిటీతో ఉన్న మేజర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ ఎయిర్ఈ పోర్ట్ ఇప్పుడు ఒక వింత సమస్యను ఎదుర్కొంటుంది. ఆ సమస్యను అధిగమించడానికి పందుల సాయం తీసుకుంటున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఆ సమస్య ఏంటో.. పందులు అధికారులకు ఎలా సహాయపడుతున్నాయో చూద్దాం…

యూరోపియన్ దేశంలోని స్కిఫోల్ ఎయిర్‌పోర్టులో చుట్టు పక్కల ప్రాంతమంతా 10 చదరపు మైళ్లు పైగా నీటితో నిండిపోతుంది. దీంతో అది వ్యవసాయభూమిగా తయారైపోయింది. దాంతో ఆ ప్రదేశానికి ఆహారం కోసం భారీ సంఖ్యలో పక్షులు రావడంమొదలు పెట్టాయి. పంట పొలాల్లోకి వచ్చే పక్షులు, బాతులు అక్కడ రన్ వేలపైకి రావడం మొదలు పెట్టాయి.. ఇది ఎయిర్ పోర్ట్ కు వచ్చి పోయే విమానాలకు పెద్ద సమస్యగా తయారైంది. రన్ వే మధ్యలో బాతులు గుంపులుగా రావడంతో విమాన రాకపోకలకు జాప్యం కలిగిస్తున్నాయి. దీంతో ఏవియేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ పక్షుల బెడదను అధిగమించడానికి ఓ ఇరవై పందులను ఆమ్‌స్టర్‌డమ్ స్కిఫోల్ ఎయిర్‌పోర్టు రిక్రూట్ చేసుకుంది. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న 500ఎకరాల చెరకుతోటల్లో పందులను విడిచి పెట్టారు.. పందులను పంట చేలల్లో వదిలిన కొన్ని గంటల్లోనే మొత్తం పంటను తినేశాయి. ఇక బాతులు తినడానికి ఏమీ మిగలకపోవడంతో.. పక్షులు బాతులు అటువైపు చూడడం లేదని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఆ రకంగా పందులకు ఉద్యోగం కల్పించి బాతుల బెడదనుంచి తప్పించుకున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )