IND vs PAK Match Highlights: 29 ఏళ్ల చరిత్ర తిరగరాసిన బాబర్ అజామ్.. దుబాయ్‌లో కోహ్లీసేన దుమ్ముదులిపిన పాకిస్తాన్

Narender Vaitla

|

Updated on: Oct 24, 2021 | 11:28 PM

IND vs PAK Live Score in Telugu: కీలకమైన పోటీలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 152 లక్ష్యాన్ని ఉంచింది.

IND vs PAK Match Highlights: 29 ఏళ్ల చరిత్ర తిరగరాసిన బాబర్ అజామ్.. దుబాయ్‌లో కోహ్లీసేన దుమ్ముదులిపిన పాకిస్తాన్
T20 World Cup 2021, Ind Vs Pak

IND vs PAK:  టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. పాకిస్థాన్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, అజమ్‌లు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించారు.  అసలు ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత్‌ ఇచ్చిన 151 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్‌ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పాక్‌ జయ కేతనాన్ని ఎగరవేసింది.

2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మరోసారి ఢీకొనబోతున్నాయి. చివరిసారిగా ఇరు జట్లు వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈసారి టీ20 ప్రపంచకప్‌‌లో ఢీకొంటున్నాయి. అంటే, ఫార్మాట్ మాత్రమే మారింది. సహజంగానే ఆటగాళ్ల వైఖరిలో కూడా మార్పు వస్తుంది. అయితే టీమిండియా ఈసారి మరో విజయం సాధించి పాకిస్థాన్‌పై 6-0తో కొనసాగాలని కోరుకుంటుంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏకపక్షంగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. 2021 టీ 20 వరల్డ్ కప్‌లో, భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ రెండూ కూడా నేటి గొప్ప మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.

టీ 20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ చరిత్ర.. టీ 20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ 5 సార్లు తలపడ్డాయి. అన్ని సందర్భాల్లో, భారతదేశం తన ప్రత్యర్థిపై విజయం సాధించింది.

భారత్, పాకిస్థాన్ మధ్య చివరి 5 మ్యాచ్‌లు.. గత 5 మ్యాచ్‌లలో కూడా పాకిస్తాన్‌పై భారత్ పైచేయి సాధించింది. గత ఐదు ఎన్‌కౌంటర్లలో భారత్ 4 గెలిచింది. పాకిస్తాన్ 1 మాత్రమే గెలిచింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 24 Oct 2021 11:04 PM (IST)

    పాకిస్థాన్‌ సంచలన విజయం.. ఎక్కడ తగ్గలేరుగా..

    పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయారు. దుబాయ్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత్‌ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ అవోకగా చేధించింది. ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా సంచల విజయాన్ని నమోదు చేసుకుంది.

  • 24 Oct 2021 10:48 PM (IST)

    అద్భుతం జరిగేనా..

    భారత్‌ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడంలో పాకిస్థాన్‌ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తుండంతో పాక్‌ విజయం దిశగా దూసుకుపోతోంది. రిజ్వాన్‌, బాబర్‌లు తమ ఆటతీరుతో రెచ్చిపోతున్నారు. పాకిస్థాన్‌ గెలవడానికి ఇంకా కేవలం 22 పరుగుల దూరంలో ఉంది. మరి భారత్‌ గెలవాలంటే కచ్చితంగా ఏదైనా అద్భుతం జరగాల్సిన అవసరం ఉంది.

  • 24 Oct 2021 10:17 PM (IST)

    10 ఓవర్లకు పాక్ స్కోర్ 71/0

    10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్లేమి నష్టపోకుండా 71 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్ 35, బాబర్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 10:03 PM (IST)

    పాకిస్తాన్‌తో తొలిసారి ఔటైన విరాట్ కోహ్లీ

    78*(61) కొలంబో 2012 36*(32) మీర్పూర్ 2014 55*(37) కోల్‌కతా 2016 57(49) దుబాయ్ 2021

  • 24 Oct 2021 10:01 PM (IST)

    టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థికి వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు

    గేల్ 274 వర్సెస్ ఆస్ట్రేలియా దిల్షాన్ 238 వర్సెస్ WI జయవర్ధనే 226 వర్సెస్ NZ కోహ్లీ 226 వర్సెస్ పాక్

  • 24 Oct 2021 10:00 PM (IST)

    6 ఓవర్లకు పాక్ స్కోర్ 43/0

    6 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్లేమి నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్ 25, బాబర్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 09:51 PM (IST)

    4 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 24/0

    4 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్లేమి నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్ 15, బాబర్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 09:36 PM (IST)

    తొలి ఓవర్ ముగిసే సరికి పాక్ స్కోర్ 10/0

    తొలి ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్లేమి నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్ 10, బాబర్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 09:30 PM (IST)

    పాకిస్తాన్ టార్గెట్ 152

    కీలకమైన పోటీలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 152 లక్ష్యాన్ని ఉంచింది.

  • 24 Oct 2021 09:14 PM (IST)

    19 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 144/6

    19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది.

  • 24 Oct 2021 09:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    కోహ్లీ 57(49 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.

  • 24 Oct 2021 09:05 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్

    జడేజా 13(12 బంతులు, 1 ఫోర్) రూపంలో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. హసన్ అలీ బౌలింగ్‌లో నవాబ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.

  • 24 Oct 2021 09:01 PM (IST)

    కోహ్లీ అర్థ సెంచరీ

    ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి భారత్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 45 బంతుల్లో తన అర్థ సెంచరీ(5 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసి, భారత్ పోరాగే స్కోర్‌ను సాధించేందుకు ప్రయత్నంచేస్తోంది.

  • 24 Oct 2021 08:49 PM (IST)

    15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 100/4

    15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 37(35 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), జడేజా 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 08:38 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    రిషబ్ పంత్ 39(30 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో అతనే క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.

  • 24 Oct 2021 08:34 PM (IST)

    12 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 81/3

    12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 28(27 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్), పంత్ 37(28 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 08:21 PM (IST)

    10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 60/3

    10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 26(24 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్), పంత్ 19(19 బంతులు, 2 ఫోర్లు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 08:16 PM (IST)

    9 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 52/3

    9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 24, పంత్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 08:12 PM (IST)

    8 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 43/3

    8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 22, పంత్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 08:02 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    సూర్య కుమార్ యాదవ్ (11) రూపంలో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. హసన్ తన తొలి ఓవర్‌లోనే టీమిండియాను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం 5.4 ఓవర్లో భారత్ 31 పరుగులు చేసింది.

  • 24 Oct 2021 07:59 PM (IST)

    టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యాక మండుతోన్న ట్విట్టర్

  • 24 Oct 2021 07:56 PM (IST)

    తొలి సిక్స్ కొట్టిన కోహ్లీ

    వరుస వికెట్లతో ఒత్తిడిలో ఉన్న భారత్‌ను కోహ్లీ, సూర్యకుమార్ జోడీ కాస్త ఊరటనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షాహిన్ బౌలింగ్‌లో 86 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టి టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు.

  • 24 Oct 2021 07:51 PM (IST)

    4 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 21/2

    4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 21 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 6, సూర్య కుమార్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 07:48 PM (IST)

    తొలి సిక్స్

    వరుస వికెట్లతో ఒత్తిడిలో కూరకపోయిన భారత్‌ను సూర్యకుమార్ తొలి సిక్స్ కొట్టి కొంత ఊరటనిచ్చాడు. షాహిన్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టి ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు.

  • 24 Oct 2021 07:44 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్

    కేఎల్ రాహుల్(3) రూపంలో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. షాహిన్ తన రెండో ఓవర్‌లో రెండో వికెట్‌ను తీసుకున్నాడు.

  • 24 Oct 2021 07:38 PM (IST)

    తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ 2/1

    తొటి ఓవర్ ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోయి 2 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ 1, కోహ్లీ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 24 Oct 2021 07:38 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    రోహిత్ రూపంలో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ సున్నాకే పెవిలియన్ చేరాడు.

  • 24 Oct 2021 07:31 PM (IST)

    మొదలైన టీమిండియా బ్యాటింగ్

    కీలక మ్యాచులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.

  • 24 Oct 2021 07:08 PM (IST)

    IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

  • 24 Oct 2021 07:06 PM (IST)

    టాస్ గెలిచిన పాకిస్తాన్

    కీలక మ్యాచులో కీలకమైన టాస్‌ను పాకిస్తాన్ టీం గెలిచింది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 24 Oct 2021 06:55 PM (IST)

    IND vs PAK Live: ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆటగాళ్లు..

    అతి పెద్ద మ్యాచ్‌లో టాస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. ఫైనల్ వార్మప్‌లో నిమగ్నమై ఉన్నాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.

  • 24 Oct 2021 06:49 PM (IST)

    IND vs PAK Live: భారత్ కేవలం 26 బంతులే ఆడింది

    గత దశాబ్దంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొన్ని మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో ఈ సంఖ్య మరింత తగ్గింది. దాని ప్రభావంతో రెండు జట్ల పరస్పర అనుభవంపై కూడా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

    ప్రపంచకప్‌లో ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న బౌలర్ల నుంచి భారత జట్టులో ఉన్న ప్లేయర్లు కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్నారు. పాక్ బ్యాట్స్‌మెన్‌ల అనుభవం మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంది. ప్రస్తుత భారత బౌలర్‌లకు వ్యతిరేకంగా 150 బంతులు మాత్రమే ఆడగలిగారు.

  • 24 Oct 2021 06:37 PM (IST)

    IND vs PAK Live: స్టేడియానికి పోటెత్తుతోన్న జనం..

    ఇటు భారత అభిమానులే కాదు, అటు పాకిస్థాన్ అభిమానులు కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. స్టేడియం లోపలికి వెళ్లి తమ జట్టుకు, ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజమ్‌ని ఉత్సాహాపరిచేందుకు స్టేడియానికి చేరుకుంటున్నారు.

    Pakistan Team Fans 1

  • 24 Oct 2021 06:21 PM (IST)

    IND vs PAK: ఇరు జట్లకు అనుకూలమైన ఓ రికార్డు బద్దలు కానుంది

    ఈరోజు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఏ జట్టుకైనా అనుకూలమైన ఓ రికార్డు బద్దలవక తప్పదు.

    అదేమిటంటే.. వరల్డ్ కప్ (వన్డే, టీ20) లో పాకిస్తాన్‌ను భారత్ వరుసగా 12 సార్లు ఓడించింది. ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ యూఏఈలో పాకిస్థాన్ తరఫున ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.

    అంటే, ఈరోజు చరిత్ర మారబోతోంది. ఏం జరుగుతుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • 24 Oct 2021 06:00 PM (IST)

    IND vs PAK: ది బాయ్స్‌ ఇన్ బ్లూ

  • 24 Oct 2021 05:53 PM (IST)

    స్టేడియానికి బయలుదేరిన భారత ప్లేయర్లు

    చారిత్రాత్మక మ్యాచ్ కోసం భారత జట్టు దుబాయ్ స్టేడియాని బయలుదేరింది. భారత ఆటగాళ్లు హోటల్ నుంచి బయటకు వెళ్లిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. భారత ఆటగాళ్ల ముఖాల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది.

  • 24 Oct 2021 05:51 PM (IST)

    బాబర్‌ను హెచ్చరించిన అక్తర్..

    బాబర్‌ నీకో ముఖ్య విషయం చెబుతున్నా.. కోహ్లీసేనతో మైదానంలో పోటీపడుతున్నప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఆడు అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.

  • 24 Oct 2021 05:44 PM (IST)

    ఇది రిజ్వాన్, బాబర్ల ఏడాది..

    పాకిస్తాన్ టీం నుంచి భారతదేశానికి అతిపెద్ద ముప్పు ఎవరు? అందరూ ఈ ప్రశ్నకు బాబర్ అజామ్, మొహమ్మద్ రిజ్వాన్ అనే రెండు పేర్లను సూచిస్తారు. ఎందుకుంటే పాకిస్తాన్ జట్టులో ఈ ఓపెనింగ్ జోడీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు నిరంతరంగా పరుగులు చేస్తున్నారు. 2021లో వీరిద్దరూ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించారు.

    వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది సెంచరీతో సహా 752 పరుగులు చేశాడు. అదే సమయంలో, కెప్టెన్ బాబర్ అజామ్ సెంచరీతో సహా 523 పరుగులు చేసి నంబర్ 2లో ఉన్నాడు.

  • 24 Oct 2021 05:40 PM (IST)

    దుబాయ్ స్టేడియానికి చేరుకున్న పాక్ ఆటగాళ్లు

  • 24 Oct 2021 05:31 PM (IST)

    BAN vs SL: మ్యాచ్ పరిస్థితి

    భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రస్తుతం షార్జా వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ తరఫున ఓపెనర్ మహ్మద్ నయీమ్, సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో శ్రీలంక ముందు 171 పరుగుల లక్ష్యం ఉంది.

  • 24 Oct 2021 05:18 PM (IST)

    IND vs PAK: గేమ్ స్విచ్‌ ఆన్.. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు

  • 24 Oct 2021 05:07 PM (IST)

    దుబాయ్ స్టేడియం ముందు మొదలైన సందడి..

    దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చారిత్రాత్మక మ్యాచ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉంది. అయితే మైదానం వెలుపల వాతావరణం మొత్తం మారిపోయింది. TV9 రిపోర్టర్ సుభయన్ చక్రవర్తి స్టేడియం వెలుపల ఉన్నారు. ఇప్పటికే స్టేడియం ముందు అభిమానుల సమూహాలు సందడి చేయడం ఇక్కడ చూడొచ్చు.

  • 24 Oct 2021 05:03 PM (IST)

    ఫుడ్ ఆర్డర్‌లపై ఆఫర్లే ఆఫర్లు..

    ప్రతీసారీ తమదైన రీతిలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రజాదరణను పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఏంలేదు. పాకిస్తాన్‌లోని ప్రముఖ ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ ‘కరీమ్’ ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేశాడు. పాకిస్తాన్‌లో ఈ రోజు మ్యాచ్‌కు సంబంధించి ప్రత్యేక ఆఫర్ ఇచ్చారు. ఈరోజు మ్యాచ్ సమయంలో ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే, లక్కీ కస్టమర్లు ఉచితంగా లేదా తక్కువ ధరలో ఆహారాన్ని పొందవచ్చు. అయితే ఈ మ్యాచులో పాకిస్తాన్ గెలవాలని కండీషన్ పెట్టారు.

  • 24 Oct 2021 04:51 PM (IST)

    “మా రోహిత్ భాయ్” అంటోన్న హసన్ అలీ..

    2019 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. మరికొద్ది గంటల్లో టీ 20 ప్రపంచకప్‌‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండగా.. పాక్ ప్లేయర్ హసన్ అలీ ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. ICC కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హసన్ “మా రోహిత్ భాయ్‌ని చూస్తే.. మీకు ఇంకేం కావాలి” అని పేర్కొన్నాడు. ఫన్నీ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి.

  • 24 Oct 2021 04:45 PM (IST)

    షోయబ్ అక్తర్ పాకిస్థాన్‌కు సలహా ఇచ్చాడు..

    భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. అయితే మ్యాచుకు ముందు షోయబ్ అక్తర్ పాకిస్తాన్‌ టీంకు ఓ సలహా ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థానీ దిగ్గజ పేసర్ తన అభిప్రాయాలను కాస్త ఫన్నీగా వెల్లడించాడు. అదేంటో ఇక్కడ చదవండి..

  • 24 Oct 2021 04:33 PM (IST)

    ఒడిశా నుంచి దుబాయ్‌కి శుభాకాంక్షలు పంపారు

    భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ అంటే మైదానంలోని ఉత్సాహం లేదా స్టాండ్‌లలో ప్రేక్షకుల ఉత్సాహం మాత్రమే కాదు.. రెండు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ మూలలో ఈ స్పెషల్ డే కనిపిస్తోంది. అయితే తాజాగా భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం  ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో ఓ ప్రత్యేకమైన బొమ్మ వేసి ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 24 Oct 2021 04:23 PM (IST)

    పాకిస్థాన్ జర్నలిస్ట్ VS విరాట్ కోహ్లీ

    ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల చరిత్ర గురించి విరాట్‌ కోహ్లిని ఓ పాక్‌ జర్నలిస్ట్‌ ప్రశ్నించాడు. దానిపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, మా జట్టు ఆ రికార్డుల గురించి ఎప్పుడూ మాట్లాడదు. మాకు ప్రతి మ్యాచ్ కొత్త మ్యాచ్‌లాంటిదే అని తెలిపాడు.

  • 24 Oct 2021 04:21 PM (IST)

    IND vs PAK: UAEలో పాకిస్థాన్ అద్భుత రికార్డు

    పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు ప్రపంచకప్ గురించి నిరంతరం ఒక విషయాన్ని పునరావృతం చేస్తున్నాడు. తన జట్టుకు యూఏఈలో టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం చాలా ఉందని, దీంతో పాక్ జట్టు ప్రయోజనం పొందుతుందని పేర్కొంటున్నాడు.

    యూఏఈలో ఇప్పటి వరకు పాకిస్థాన్ మొత్తం 36 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆ జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 14 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాక్జ ట్టు విజయం శాతం 61.1 గా ఉంది.

Published On - Oct 24,2021 4:17 PM

Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!