Ind Vs Pak: పాకిస్తాన్‌తో ఎవరెవరు ఆడతారంటే.. దినేష్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటన..
మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ పాకిస్తాన్‌తో ఆడబోయే టీమ్ ఇండియా యొక్క ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేశాడు. T20 ప్రపంచ కప్ 2021లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడే అవకాశం ఉన్నవారి పేర్లను ప్రటించాడు...
మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ పాకిస్తాన్‌తో ఆడబోయే టీమ్ ఇండియా యొక్క ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేశాడు. T20 ప్రపంచ కప్ 2021లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడే అవకాశం ఉన్నవారి పేర్లను ప్రటించాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో కూడా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆకట్టుకున్నాడని చెప్పాడు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లైవ్ మ్యాచ్, స్కోర్, లైవ్ బ్లాగ్‌ను ఇక్కడ చూడండి
“శార్దూల్ గొప్ప రిథమ్‌లో ఉన్నాడు. అతనికి కీలక వికెట్లు తీయడంలో ఈ నైపుణ్యం ఉంది. కాబట్టి నేను అతనిని ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో అతన్ని కచ్చితంగా తీసుకుంటున్నాను. ఐపీఎల్ ఫైనల్‌లో కూడా అతను వచ్చి మ్యాచ్‌ను తలకిందులు చేశాడు” కార్తిక్ అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (శార్దుూల్) వల్ల ఓడిపోయిందని చెప్పాడు. IPL ఫైనల్‌లో శార్దూల్ 3/38తో చక్కని ప్రతిభ కనబరిచాడు. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి కీలక వికెట్లు తీసి CSKని విజయపథంలో నడిపించాడని పేర్కొన్నాడు. శార్దూల్ కాన్ఫిడెన్స్ ప్లేయర్‌గా కనిపించాడని, ప్రణాళిక ప్రకారం విషయాలు జరిగినప్పుడు ఆనందించాడని కార్తీక్ చెప్పాడు. కార్తీక్ తన ప్లేయింగ్ XIని ప్రటకించాడు. ఇందులో రెండు ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి.
దినేష్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జాడేజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్/ షమీ.
Read Also.. IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..