Shoaib Akhtar: విన్ అవ్వాలంటే ఇండియా టీమ్‌కు నిద్రమాత్రలు ఇవ్వండి.. అక్తర్ ఫన్నీ కామెంట్స్
బిగ్ బిగ్ సండే.. కాసేపట్లో.. ఇండియా వర్సెస్ పాక్.. క్రికెట్ యుద్ధం జరుగుతోంది. యావత్ భారతం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 28 నెలల తర్వాత దాయాదుల పోరు జరగనుంది.
బిగ్ బిగ్ సండే.. కాసేపట్లో.. ఇండియా వర్సెస్ పాక్.. క్రికెట్ యుద్ధం జరుగుతోంది. యావత్ భారతం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 28 నెలల తర్వాత దాయాదుల పోరును వీక్షించే క్షణాల కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ టఫ్ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారతే ఎక్కువ మ్యాచ్‌ల్లో విన్ అయ్యింది. టీమిండియా పాక్‌ను మట్టికరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో షోయబ్ అక్తర్, ఫన్నీ సలహాను పాకిస్థాన్ జట్టుకు ఇచ్చాడు. ఇండియాపై గెలవాలంటే మ్యాచ్‌కు ముందు ఆ జట్టు ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని సూచించాడు. మెంటార్ ధోనీని బ్యాట్ పట్టుకోకుండా చూసుకోవాలని పాక్ జట్టుకు సూచించాడు. రెండు రోజులపాటు విరాట్ కోహ్లీని ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకుండా అడ్డుపడాలి అంటూ సరదాగా కామెంట్ చేశారు.
ఇక ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని తమ జట్టుకు సూచించాడు అక్తర్. డాట్ బాల్స్ లేకుండా చూసుకోవాలని సూచించాడు. 5-6 ఓవర్ల వరకు బాల్ టూ బాల్ రన్ రేట్ కాపాడుకోవాలని చెప్పాడు. మంచి లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచితే.. బౌలింగ్‌లో విరుచుకుపడి, సులభంగా వికెట్లు తీయవచ్చని పేర్కొన్నాడు.
కాగా టీమిండియా గెలుపును ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. హోమాలు నిర్వహిస్తున్నారు. కోహ్లీ సేన విజయంతో తిరిగి రావాలని కోరుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చిన్నారులు సైతం జాతీయ జెండాలను చేతబట్టి.. టీ ట్వంటీ విన్నర్ భారత్ అంటున్నారు.
Also Read: భారత్‌పై గెలిస్తే.. పాక్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్.. సంచలన ప్రకటన చేసిన పీసీబీ ఛైర్మన్