Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత వెర్సస్ పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ రేటెంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటేనే వేరే లెవెల్‌. గ్రౌండ్‌లో దంచి కొట్టుడు, ఊత కొట్టుడు, నాటు కొట్టుడు.. ఇలా అన్ని కలగలిపి ఉంటాయి.

IND vs PAK: భారత వెర్సస్ పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ రేటెంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్
Ind Vs Pak
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 24, 2021 | 12:37 PM

భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటేనే వేరే లెవెల్‌. గ్రౌండ్‌లో దంచి కొట్టుడు, ఊత కొట్టుడు, నాటు కొట్టుడు.. ఇలా అన్ని కలగలిపి ఉంటాయి. అలాంటి మ్యాచ్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తుంది. అదే సమయంలో యాడ్స్‌ రేట్స్‌ కూడా దుమ్ము దులిపేస్తున్నాయి. ఒకే ఒక్క సెకన్‌కి లక్షన్నర అంటే అంటే నమ్మగలరా.. యస్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో యాడ్స్‌ రేట్‌ అమాంతం పెరిగిపోయింది. భారత్ – పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే హై టెన్షన్‌. పైగా వరల్డ్‌కప్‌లో ధనాధన్‌ ఆటంటే ఆ క్రేజ్ చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న స్టార్‌ స్పోర్ట్స్‌ యాడ్స్‌ రేట్‌ని అమాంతం పెంచేసింది.

మాములుగా ఈ టీ20 వరల్డ్ కప్‌లో  1 సెకన్‌కి రూ.1,50,000,  10 సెకన్లకి రూ.15,00,000 వసూలు చేస్తోంది స్టార్ స్పోర్ట్స్. అయితే ఈ రేటు మిగతా అన్ని మ్యాచులకు ఉంటుంది. కానీ  భారత్-పాక్ మ్యాచ్ అయితే లెక్క వేరుంటుంది కదా. అందునా ఆదివారం. ఇక వ్యూయర్షిప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ కోసం 10 సెకన్ల యాడ్‌కి రూ.30,00,000 ఛార్జ్ చేస్తోంది స్టార్ స్పోర్ట్స్. యాడ్‌ రేట్‌ దాదాపు డబుల్ చేసేసింది. హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో యాడ్‌కి అదిరిపోయే రేటు ఉంటుంది అని చెప్పకనే చెప్పింది.

దాయాదుల మధ్య ఇవాళ ఇంట్రస్టింగ్‌ ఫైట్‌ జరుగుతోంది. దీంతో టీమిండియా గెలవాలంటూ పూజలు చేస్తోంది యావత్‌ భారతం. అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. పాక్‌ను ఓడించి ఇండియాకు తిరిగిరావాలని నినాదాలు చేస్తున్నారు.

Also Read: దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ.. విజయ వరించాలంటూ కోట్లాది భారతీయుల ఆరాటం

Telangana: అప్పు తీర్చేందుకు.. రూ.2 వేలు సమకూరలేదని వ్యక్తి సూసైడ్