Telangana: అప్పు తీర్చేందుకు.. రూ.2 వేలు సమకూరలేదని వ్యక్తి సూసైడ్

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Oct 24, 2021 | 12:11 PM

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.

Telangana: అప్పు తీర్చేందుకు.. రూ.2 వేలు సమకూరలేదని వ్యక్తి సూసైడ్
Suicide
Follow us

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నాల్‌‌కు చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో వర్క్ చేస్తున్నారు. మూడు నెలల క్రిందట సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి వద్ద రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. ఇతను ఊరూరా తిరిగి అప్పులిస్తూ ఉంటాడు. తాజాగా అప్పును తీర్చాలని ఓ మహిళతో పాటు మరో ఐదుగురు ఈ నెల 22న పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. అయితే తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని.. త్వరలో సమకూరుస్తానని చెప్పాడు. అయినా వారు వినలేదు. తీవ్ర ఒత్తిడి చేశారు. కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త నోటు రాసుకొని వెళ్తామని మొండికేసి కూర్చున్నారు. దీంతో రెండు వేలు కోసం ఆనంద్‌ తనకు తెలిసిన చాలామందిని అడిగాడు. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు.

కుంచెరుకలి అతనితో వచ్చినవారు డబ్బు ఇచ్చే వరకు వెళ్లేది లేదని అతడి ఇంటి వద్దే భీష్ముంచుకు కూర్చున్నారు. చివరకు డబ్బు ఇచ్చే వరకు తమతో పాటు రావాలని చెప్పగా శనివారం రోజు తుర్కపల్లి వరకు వెళ్లాడు. తెలిసిన వారిని బాగా రిక్వెస్ట్ చేస్తే ఒకరు రూ.వెయ్యి ఇచ్చారు. వాటితో వారికి భోజనాలు గట్రా పెట్టించాడు. వారు కొత్త నోటు రాసుకొని వెళ్లి పోయారు. ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. కుటుంబ సభ్యుల కంప్లైంట్‌తో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: IND vs PAK: దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ.. విజయ వరించాలంటూ కోట్లాది భారతీయుల ఆరాటం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu