IND vs PAK: దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ.. విజయం వరించాలంటూ కోట్లాది భారతీయుల ఆరాటం
భారత్ - పాక్ మ్యాచ్ అంటే చాలు.. ప్రతి అభిమానికి యుద్ధ భూమిలో ఉన్న ఫీలింగ్.. నరాలు తెగిపోయే ఉత్కంఠ. బ్యాట్ పట్టి కదనరంగంలో దూకిన వీరుల్లా మారుతారు.
భారత్ – పాక్ మ్యాచ్ అంటే చాలు.. ప్రతి అభిమానికి యుద్ధ భూమిలో ఉన్న ఫీలింగ్.. నరాలు తెగిపోయే ఉత్కంఠ. బ్యాట్ పట్టి కదనరంగంలో దూకిన వీరుల్లా మారుతారు. బంతితో శత్రువుపై దాడి చేసే సైనిడవుతాడు.. గెలుపు నాదే అనే ధీమాతో అభిమాని చెలరేగుతాడు స్టేడియంలో విజయ గర్వంతో ఉవ్వెత్తున ఎగిసే మువ్వన్నెల పతాకాన్ని చేతపట్టి… మన పోరాటానికి ప్రతీకగా నిలబడతాడు. స్టేడియంలో ఇండియన్ ప్లేయర్ బౌండరీ కొడితే.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్ ఊగిపోతారు.. కేకలతో హోరెత్తిస్తారు. పిచ్‌లో ప్రత్యర్ధి వికెట్ పడితే.. దేశంలో అభిమానులు చిందులేస్తారు. భారత్ – పాక్ మ్యాచ్ మధ్య టీట్వంటీ పోరు.. ఇది ఆట మాత్రమే కాదు.. కోట్లాది భారతీయుల భావోద్వేగం.. ఉద్రేకం. దాయాది టీమ్‌లు ఎన్నిసార్లు పోటీ పడినా టీమిండియానే గెలవాలనే ఆకాంక్షతో దేశంలో లక్షలాది మంది ఫ్యాన్స్ పూజలు చేస్తారు. ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫివర్ పట్టుకుంది. ఏ స్టేడియంలో చూసినా అభిమానులు సందడి చేస్తున్నారు.
భారత్ – పాక్ టీ20 మ్యాచ్ కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ స్టేడియంలో ఇండియా గెలవాలంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. టీ20 మ్యాచ్‌లో పాక్‌కి దబిడి దిబిడే అంటున్నారు విశాఖలోని క్రికెట్ ఫ్యాన్స్. రోహిత్, రాహుల్‌లు రాణిస్తారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. టీమిండియా గెలవాలంటూ పూజలు చేస్తోంది యావత్ భారతం. అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. పాక్‌ను ఓడించి ఇండియాకు తిరిగిరావాలని నినాదాలు చేస్తున్నారు.
Also Read:భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..