India vs Pakistan T20 World Cup Puja: టీమిండియా గెలుపు కోసం అభిమానులు ఏం చేస్తున్నారంటే..
భారత్ - పాక్ మ్యాచ్ అంటే చాలు.. ప్రతి అభిమానికి యుద్ధ భూమిలో ఉన్న ఫీలింగ్.. నరాలు తెగిపోయే ఉత్కంఠ. బ్యాట్ పట్టి కదనరంగంలో దూకిన వీరుల్లా మారుతారు. బంతితో శత్రువుపై దాడి చేసే...
భారత్ – పాక్ మ్యాచ్ అంటే చాలు.. ప్రతి అభిమానికి యుద్ధ భూమిలో ఉన్న ఫీలింగ్.. నరాలు తెగిపోయే ఉత్కంఠ. బ్యాట్ పట్టి కదనరంగంలో దూకిన వీరుల్లా మారుతారు. బంతితో శత్రువుపై దాడి చేసే సైనిడవుతాడు.. గెలుపు నాదే అనే ధీమాతో అభిమాని చెలరేగుతాడు. స్టేడియంలో విజయ గర్వంతో ఉవ్వెత్తున ఎగిసే మువ్వన్నెల పతాకాన్ని చేతపట్టి… మన పోరాటానికి ప్రతీకగా నిలబడతాడు. స్టేడియంలో ఇండియన్ ప్లేయర్ బౌండరీ కొడితే.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్ ఊగిపోతారు.. కేకలతో హోరెత్తిస్తారు. పిచ్‌లో ప్రత్యర్ధి వికెట్ పడితే.. దేశంలో అభిమానులు చిందులేస్తారు.
భారత్ – పాక్ మ్యాచ్ మధ్య టీట్వంటీ పోరు.. ఇది ఆట మాత్రమే కాదు.. కోట్లాది భారతీయుల భావోద్వేగం.. ఉద్రేకం. ఈ రెండు జట్లు ఎన్నిసార్లు పోటీ పడినా టీమిండియానే గెలవాలనే ఆకాంక్షతో దేశంలో లక్షలాది మంది ఫ్యాన్స్ పూజలు చేస్తారు. ఇప్పుడు కూడా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శనివారం సాయంత్రం భారత క్రికెట్ జట్టు అభిమానులు గంగా ఆర్తి సమయంలో దీప మాలలతో అలంకరించి టీమ్ ఇండియా కోసం ప్రార్థించారు. అదే సమయంలో ప్రజలందరూ కూడా టీమిండియా చిత్రాన్ని తమ చేతిలో ఉంచుకుని.. భారత జట్టు విజయం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా హారతి నిర్వాహకులే కాదు, సామాన్య భక్తులు కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిని వ్యక్తం చేస్తూ టీమ్ ఇండియాను గెలిపించాలని దీపాలు వెలిగించి ప్రార్థించారు.
Karnataka | Indian cricket team fans perform ‘havan’ ahead of the T20 World Cup match against Pakistan, in Bengaluru on Saturday pic.twitter.com/SKy0Qn3vio
— ANI (@ANI) October 23, 2021
ఇవి కూడా చదవండి: Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..