12 ఏళ్ల బాలిక తండ్రిని దారుణంగా చంపేసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Crime News: బ్రెజిల్‌లో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక తన సొంత తండ్రిని దారుణంగా చంపేసింది. ఆశ్చర్యకరంగా ఆ హత్యలో13 ఏళ్ల స్నేహితుడిని కూడా

12 ఏళ్ల బాలిక తండ్రిని దారుణంగా చంపేసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
12 Year Girl

Crime News: బ్రెజిల్‌లో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక తన సొంత తండ్రిని దారుణంగా చంపేసింది. ఆశ్చర్యకరంగా ఆ హత్యలో13 ఏళ్ల స్నేహితుడిని కూడా చేర్చుకుంది. ప్రస్తుతం వారిద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ హత్య వెనుక కారణం తెలిసి పోలీసులతో పాటు అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమాచారం ప్రకారం.. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో జరిగింది. మృతుడు నీఫ్ లూయిజ్ వెర్లాంగ్‌గా గుర్తించారు.

నీఫ్ లూయిజ్ వెర్లాంగ్‌ ఒక పోలీసు అధికారి. ఈ హత్య వెనుక కారణం తెలుసుకున్న తర్వాత పిల్లలను కొన్ని విషయాలకు దూరంగా ఉంచడం మంచిదని అందరు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. నీఫ్ కుమార్తె పబ్లిసిటీ పిచ్చితో ఫేమస్ కావాలనే ఉద్దేశ్యంతో అతన్ని హత్య చేసింది. 2002లో జరిగిన ఒక హత్య కేసు నుంచి ఈ అమ్మాయి ప్రేరణ పొందింది. అప్పటి నుంచి ఆమె ఒక కిల్లర్ అమ్మాయిలా మారడానికి ప్రయత్నిస్తుంది.

సుసాన్ లూయిస్ అనే అమ్మాయి 20 సంవత్సరాల క్రితం బ్రెజిల్‌లో తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. అప్పుడు సుసాన్ పాఠశాలలో చదువుకుంటుంది. ప్రియుడితో కలిసి ఈ హత్య చేసింది. ఈ దిగ్భ్రాంతికరమైన హత్య తర్వాత సుసాన్ వార్తా ముఖ్యాంశాలలో నిలిచింది. నీఫ్ 12 ఏళ్ల కుమార్తె ఈ కేసు గురించి విన్నప్పుడు ఆమె కూడా సుసాన్ లాగా మారాలని నిర్ణయించుకుంది. సుసాన్ లాగే ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా తమ నేరాన్ని అంగీకరించారు.

తప్పు చేశానన్న పశ్చాత్తాపం వారిలో కనిపించడం లేదు. ఈ ఇద్దరు అమ్మాయిలు తమ స్టేట్‌మెంట్‌లో తాము ఫేమస్ కావాలని మాత్రమే కోరుకున్నామని తెలపడం విశేషం. ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.12 ఏళ్ల బాలిక,13 ఏళ్ల స్నేహితుడి సహాయంతో నీఫ్‌ని మెడపై మూడుసార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. వారిద్దరూ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

Viral Photos: ప్రపంచంలోని 5 విలాసవంతమైన జైళ్లు ఇవే.. ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు..

T20 World Cup 2021: జట్టుకు హార్దిక్ పాండ్యా కీలకం.. కానీ అతని బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది..

SL vs BAN Live Score, T20 World Cup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

Click on your DTH Provider to Add TV9 Telugu