T20 World Cup 2021: జట్టుకు హార్దిక్ పాండ్యా కీలకం.. కానీ అతని బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది..

టీ20 ప్రపంచ కప్‎‎‎లో భారత జట్టకు హార్దిక్ పాండ్యా నైపుణ్యం కీలకమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.  పాండ్యా 2019 లో లోయర్ బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుండి అప్పుడప్పుడు బౌలింగ్ చేశాడు...

T20 World Cup 2021: జట్టుకు హార్దిక్ పాండ్యా కీలకం.. కానీ అతని బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది..
Hardik
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 24, 2021 | 3:20 PM

టీ20 ప్రపంచ కప్‎‎‎లో భారత జట్టకు హార్దిక్ పాండ్యా నైపుణ్యం కీలకమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.  పాండ్యా 2019 లో లోయర్ బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుండి అప్పుడప్పుడు బౌలింగ్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో అతడి బ్యాటింగ్‎పై అనుమానాలు తలెత్తాయి. “అతను నా బృందంలో ఉంటాడు. అతను కొట్టిన పిండి, అతను క్లిక్ చేస్తే మ్యాచ్‌ను ఏకపక్షంగా చేసి ముగించగలడు.” అని సెహ్వాగ్ అన్నాడు.

“అతని బ్యాటింగ్ కచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. అతను ఫామ్‌లో లేకుంటే లేదా నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేయకపోతే, మీరు మరొక బ్యాటర్‌ని చూడవచ్చు, లేకపోతే, అతను నా మొదటి ఎంపిక అవుతాడు” అని అన్నాడు. ప్రతి మ్యాచ్‌లో భారత్ ఐదుగురు ఫ్రంట్‌లైన్ బౌలర్లతో తప్పనిసరిగా వెళ్లాలని సెహ్వాగ్ సూచించాడు. ” ఐదుగురు బౌలర్లతోపాటు హార్దిక్ పాండ్య లేదా టాప్ ఆర్డర్‌లోని వేరొకరు కొన్ని ఓవర్లు బౌల్ చేస్తే బాగుంటుంది” అని ఆయన అన్నారు. టీ 20 లో పాకిస్థాన్‌పై భారత్ 12-0 రికార్డు కలిగి ఉంది.

రోహిత్-రాహుల్ ద్వయం టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగాలని సెహ్వాగ్ అన్నాడు. అలాగే కోహ్లీపై కూడా టాప్ ఆర్డర్‌కు బాధ్యత వహించాలంటూ సూచించాడు. ఈ మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీని తన జట్టులో 3 వ స్థానానికి ఎంపిక చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో, కోహ్లీ తాను ప్రస్తుతం టోర్నమెంట్‌లో నెంబర్ 3లో ఆడుతానని స్పష్టం చేశాడు. అదే సమయంలో, ఓపెనింగ్‌లో రోహిత్‌తో పాటు రావడానికి రాహుల్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ తెలిపాడు. వీరూ తన జట్టులో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించాడు. ఇంగ్లండ్‌పై, ఇషాన్ 70 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అదే మ్యాచులో సూర్య 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ ఫేజ్ -2 లో కూడా, సూర్యకుమార్ కొన్ని ఇన్నింగ్స్‌లు మినహా కష్టపడుతున్నట్లు కనిపించాడు. పాకిస్థాన్‌పై ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలంటూ సూచించాడు. ఆదివారం దుబాయ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ హోరాహోరీగా తలపడనుంది.

Read Also.. IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!