T20 World Cup 2021, IND vs PAK: టీమిండియా దెబ్బకు మానసిక ఒత్తిడిలో పాకిస్తాన్..!

India vs Pakistan: అక్టోబర్ 24, ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యుద్ధం జరగనుంది. పాకిస్తాన్‌తో టీమిండియా కీలక మ్యాచ్ జరగనుంది.

T20 World Cup 2021, IND vs PAK: టీమిండియా దెబ్బకు మానసిక ఒత్తిడిలో పాకిస్తాన్..!
Ind Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: Oct 24, 2021 | 4:39 PM

T20 World Cup 2021, IND vs PAK: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్టోబర్ 24, ఆదివారం నాడు బాబర్ అజామ్ పాకిస్థాన్‌తో నీలిరంగులో విరాట్ కోహ్లీ సేన యుద్ధం చేయనున్నారు. ఐసీసీ పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2021 లో ఇరుపక్షాలు మ్యాచ్ నంబర్ 16లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తోనే ఇరుజట్లు టీ20 ప్రపంచ కప్‌లో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాయి. యూఏఈ వేదికగా భారతదేశం తమ మొదటి టీ20 మ్యాచ్ ఆడబోతుంది. కీలక మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నరాలు తెగె ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది.

దుబాయ్‌లో టీమిండియా విజయానికి కారణాలు..

అనుభవమున్నటాప్ ఆర్డర్ భారత్ సొంతం: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కాంబినేషన్‌ను ప్రకటించాడు. నీలం రంగులో ముఖ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్‌లో తమ పని పూర్తి చేసేందుకు సమాయత్తమయ్యారు. వీరంతా నిజమైన మ్యాచ్ విన్నర్లే కావడం.. టీమిండియాకు కొండంత అండగా ఉండనుంది.

అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మతో ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీకి పెద్దపీట వేయనున్నారు. వైట్ బాల్ స్పెషలిస్ట్- విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. తిరుగులేని టాప్ ఆర్డర్‌తో పాక్‌కు గట్టి పోటీ ఇచ్చందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా, పాకిస్తాన్ విషయానికి వస్తే కోహ్లీ ప్రత్యేక బ్యాటింగ్ కవచంతో అడ్డుగా నిలబడనున్నాడు. ఎందుకుంటే ఇంతవరకు పాక్‌పై విరాట్ కోహ్లీ ఔట్ కాకపోవడమే ఇందుకు కారణం.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లైవ్ మ్యాచ్, స్కోర్, బ్లాగ్‌ను ఇక్కడ చూడండి

మిడిల్ ఆర్డర్‌లోనూ రచ్చ రచ్చే.. నంబర్ 7 వరకు భారత్‌కు మ్యాచ్‌ విన్నర్లే ఉన్నారు. రవీంద్ర జడేజా, పంత్, హార్దిక్ పాండ్యా లాంటి హార్డ్ హిట్టర్లు భారత్‌కు అండగా నిలవనున్నారు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే బ్యాటింగ్ నైపుణ్యాలను కలిగి ఉండగా, ఇటీవల జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా టీంకు అవసరమైన పరుగులు సాధించడంలో తన వంతు సహకారాన్ని అందిచనున్నాడు. దీంతో బ్యాటింగ్‌లో టీమిండియా లోతుగా ఉందని అర్థమవుతుంది.

అండగా మెంటార్ సింగ్ ధోని.. ఎంఎస్ ధోనీని మెంటర్‌గా ఎంచుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహరచనలో భాగంగా జరిగిందని తెలుస్తోంది. ఇది విరాట్ సేనకు ఎంతో సహాయపడుతుంది. భారత శిబిరంలోని ఆటగాళ్లందరి బలాలు, బలహీనతలను గుర్తించి అధిగమించేలా చేసేందుకు ధోని తన అనుభమాన్ని అందించనున్నాడు. ధోని మార్గదర్శకత్వం కచ్చితంగా సహాయపడగలదు.

మానసిక ప్రభావం.. ఐసీసీ ఈవెంట్‌ల విషయానికి వస్తే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 50 ఓవర్ల ప్రపంచకప్‌లోగానీ, టీ 20 ప్రపంచకప్‌లోగానీ టీమిండియాదే విజయం. ఎల్లప్పుడూ ప్రత్యర్థులపై ఓడిపోని ఘనమైన రికార్డుతో విరాట్ సేన బరిలోకి దిగనుంది. ప్రపంచ కప్‌లలో భారత్‌పై ఇంతవరకు విజయం సాధించకపోవడంతో పాకిస్తాన్‌పై ఇది ఎంతో మానసిక ప్రభావాన్ని చూపగలదు. ఇది బాబర్ అజామ్‌ సేనపై తీవ్రంగా ఉంటుంది.

అలాగే పాక్ టీం బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్‌పై అతిగా ఆధారపడటంతో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నా.. భారత విజయాన్ని ఏమేరకు ఆపగలరో చూడాలి.

Also Read: T20 World Cup 2021: జట్టుకు హార్దిక్ పాండ్యా కీలకం.. కానీ అతని బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది..

SL vs BAN Live Score, T20 World Cup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక