SL vs BAN Highlights, T20 World Cup 2021: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం
SL vs BAN Highlights in Telugu: టీ20 ప్రపంచ కప్ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక పోరు జరగనుంది. గ్రూపు 1లో భాగంగా ఇప్పటికే రెండు పోటీలు జరిగాయి.
SL vs BAN Highlights, T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021లో భాగంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కీలక పోరు జరగనుంది. గ్రూపు 1లో భాగంగా ఇప్పటికే రెండు పోటీలు జరిగాయి. ఇక మూడో మ్యాచులో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య షార్జాలో మ్యాచ్ జరుగుతుంది. గ్రూపు 1 లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంలు చెరో విజయంతో తలో 2 పాయింట్లు సాధించాయి. ఈ టోర్నమెంట్‌లో లంక జట్టు అజేయంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియాలను చాలా సమగ్రమైన రీతిలో ఓడించి, దాసున్ శనక నేతృత్వంలోని లంకవాసులు టోర్నమెంట్‌లో అద్భుత విజయాన్ని సాధించారు.
మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు నయీం, దాస్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా నయిమ్ చెలరేగి ఆడాడు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముష్పికర్ రెహ్మాన్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్న 1, ఫెర్నాండో 1, కుమార1 వికెట్ దక్కించుకున్నారు.
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే నసూమ్ వేసిన నాలుగో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. నిసాంక కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన అసలంక ధాటిగా ఆడాడు. స్కోరు బోర్డుని పరుగెత్తించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇతనికి తోడుగా రాజపక్స హాప్ సెంచరీతో అదరగొట్టాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 2, మహ్మద్ సైఫ్‌ద్దీన్ 1, అహ్మద్ 2 వికెట్లు సాధించారు.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్(కీపర్), మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్
శ్రీలంక (ప్లేయింగ్ XI): కుసల్ పెరీరా(కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
LIVE Cricket Score & Updates
-
బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
-
బానుకా రాజపక్సా హాఫ్ సెంచరీ
బానుక రాజపక్సా హాఫ్ సెంచరీ సాధించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. మరోవైపు అసలంక 74 పరుగులతో వేగంగా ఆడుతున్నాడు. విజయానికి ఇంకా శ్రీలంక 13 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
150 పరుగులు దాటిన శ్రీలంక
శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో చరిత్ అసలంక 66 పరుగులు, రాజపక్స 45 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 19 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉంది.
-
15 ఓవర్లకు శ్రీలంక 126/4
15 ఓవర్లకు శ్రీలంక 4 వికెట్లు నష్టపోయి126 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో అసలంక 64 పరుగులు, రాజపక్స 24 పరుగులతో ఆడుతున్నారు.
-
100 పరుగులు దాటిన శ్రీలంక
శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు దాటింది. క్రీజులో అసలంక 50 పరుగులు, రాజపక్స 21 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 2, మహ్మద్ సైఫ్‌ద్దీన్ 1, అహ్మద్ 1 వికెట్ సాధించారు. శ్రీలంక విజయానికి 41 బంతుల్లో 66 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
హాఫ్ సెంచరీ చేసిన అసలంక
శ్రీలంక బ్యాట్స్‌మెన్ చరిత్ అసలంక హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. రాజపక్స 19 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. విజయానికి ఇంకా శ్రీలంక 43 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.
-
10 ఓవర్లకు శ్రీలంక 80/4
10 ఓవర్లకు శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో అసలంక 46 పరుగులు, రాజపక్స 0 పరుగులతో ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది.
-
50 పరుగులు దాటిన శ్రీలంక
శ్రీలంక 50 పరుగులు దాటింది. అసలంక 31 పరుగులు, నిసాంక 18 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి 86 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంది.
-
శ్రీలంక 5 ఓవర్లకు 39 /1
శ్రీలంక 5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో అసలంక 30 పరుగులు, నిసాంక 7 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి 90 బంతుల్లో 133 పరుగులు చేయాల్సి ఉంది.
-
బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక.. మొదటి ఓవర్‌లోనే ఒక వికెట్ ఔట్
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. నసూమ్ వేసిన నాలుగో బంతికి కుశాల్ పెరీరా బౌల్డ్ అయ్యాడు. ఒక వికెట్ కోల్పో్యి 4 పరుగులు చేసింది.
-
20 ఓవర్లకు బంగ్లాదేశ్ 171/4
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చమీర వేసిన చివరి ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి మహ్మదుల్లా ఫోర్ కొట్టాడు. చివరి బంతికి ముష్పికర్ కూడా బౌండరీ సాధించాడు.
-
16 ఓవర్లు ముగిసే సరికి..
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న బంగ్లాదేశ్ టీం నిలకడగా ఆడుతోంది. 16 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. నయీం 62, రహీం 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
10 ఓవర్లు ముగిసే సరికి..
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న బంగ్లాదేశ్ టీం నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు నష్టపోయి 72 పరుగులు చేసింది. నయీం 40, రహీం 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 7 ఫోర్లు వచ్చాయి. ఇంతవరకు ఒక్క సిక్స్ లేకపోవడం గమనార్హం.
-
5 ఓవర్లు ముగిసే సరికి..
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న బంగ్లాదేశ్ టీం నిలకడగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమి నష్టపోకుండా 38 పరుగులు చేసింది. నయీం 21, దాస్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 4 ఫోర్లు వచ్చాయి.
-
ప్లేయింగ్ XI
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్(కీపర్), మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్
శ్రీలంక (ప్లేయింగ్ XI): కుసల్ పెరీరా(కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
-
టాస్ గెలిచిన శ్రీలంక
గ్రూపు 1లో 15వ మ్యాచులో భాగంగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ టీంల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా శ్రీలంక టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Published On - Oct 24,2021 3:02 PM