Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..

భారత్ - పాక్ టీ20 మ్యాచ్ కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...

India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..
India Vs Pakistan
Follow us
Sanjay Kasula

| Edited By: Venkata Chari

Updated on: Oct 24, 2021 | 5:38 PM

బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. యావత్‌ భారతం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భారత్ – పాక్ టీ20 మ్యాచ్ కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరగడానికి కారణం ఇదే. ఇప్పటి వరకు 8 టీ 20 మ్యాచ్‌లు పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగాయి. ఇందులో టీమిండియా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో ప్రపంచకప్‌లో ప్రతిసారీ  పాకిస్తాన్ ఓటమి చవిచూడాల్సి వస్తోంది. అక్టోబర్ 24 న రెండు జట్లు రెండేళ్ల తర్వాత తలపడుతున్నాయి. 2019 లో వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ పాకిస్తాన్ భారీ తేడాతో ఓడించింది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లైవ్ మ్యాచ్, స్కోర్, లైవ్ బ్లాగ్‌ను ఇక్కడ చూడండి

టీమిండియా  తమ రెండు వార్మప్ మ్యాచ్‌లలో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించగా.. పాక్ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. విండీస్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా గత కొంతకాలంగా ఇరు జట్లు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు.

2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడు తలపడతాయి?

అక్టోబర్ 24 (ఆదివారం)న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

T20 ప్రపంచ కప్ 2021 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

T20 ప్రపంచ కప్ 2021 భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్‌ జరుగుతుంది.

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ని వివిధ భాషల్లో చూడవచ్చు.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్‌లో మీరు ఎక్కడ చూడవచ్చు?

డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఇది కాకుండా, మ్యాచ్ యొక్క ప్రత్యక్ష నవీకరణలను కూడా tv9telugu.com లో చదవవచ్చు .

జట్లు క్రింది విధంగా ఉన్నాయి:

టీమిండియా జట్టు సభ్యులు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్

పాకిస్తాన్ జట్టు సభ్యులు (చివరి 12 మంది ఆటగాళ్లు): బాబర్ అజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, హైదర్ అలీ

ఇవి కూడా చదవండి: Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..