AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: భారత్‌పై గెలిస్తే.. పాక్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్.. సంచలన ప్రకటన చేసిన పీసీబీ ఛైర్మన్

పాక్ క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీ20లో భారత్‌పై గెలిస్తే.. ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ప్రకటించారు.

IND Vs PAK: భారత్‌పై గెలిస్తే.. పాక్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్.. సంచలన ప్రకటన చేసిన పీసీబీ ఛైర్మన్
Pak Cricket Board
Ram Naramaneni
| Edited By: Venkata Chari|

Updated on: Oct 24, 2021 | 5:36 PM

Share

పాక్ క్రికెటర్లకు ఆదేశ క్రికెట్ బోర్డు.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీ20లో భారత్‌పై గెలిస్తే.. ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈమేరకు ఓ పారిశ్రామికవేత్త తనకు హామీ ఇచ్చినట్లు రమీజ్ వెల్లడించారు. బలమైన భారత జట్టును ఓడిస్తే భారీగా ఫీజులు కూడా పెంచుతామంటోంది. ప్రపంచ కప్ వేదికల్లో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న పాక్.. ఎట్లైనా ఈ సారి భారత్ ను ఓడించాలనే కసితో ఉంది. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లకు అత్యధికంగా.. 3,38,350 రూపాయల మ్యాచ్ ఫీజు ఇస్తోంది. ఇప్పుడు మ్యాచ్ గెలిస్తే.. మరో లక్షా 70వేలు బోనస్‌గా ప్లేయర్స్‌కు ఇవ్వనున్నారు. మొత్తంగా ప్రతీ ఆటగాడికి ఒక్కో మ్యాచ్ కు 5లక్షలకు పైగా ఫీజు లభించే అవకాశం ఉంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లైవ్ బ్లాగ్, స్కోర్ ఇక్కడ చూడండి

ఒకవేళ కప్ సాధిస్తే మ్యాచ్ ఫీజులో.. ఏకంగా 300 శాతం పెంచుతామని ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే.. కప్ సాధిస్తే ప్రతీ ఆటగాడికి .. ఒక్కో మ్యాచ్‌కి 10 లక్షలు దక్కనున్నాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ను ఓడించి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్తాన్ పై.. భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఈ సారి బాబర్ ఆజాం నేతృత్వంలోని పాకిస్తాన్.. ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది.

Also Read: దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ.. విజయ వరించాలంటూ కోట్లాది భారతీయుల ఆరాటం

 భారత వెర్సస్ పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ రేటెంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక