కొత్తగా వచ్చిన N440K కొవిడ్ వైరస్ అంటే ఏమిటీ..! ఏపీలో ఎక్కువగా వ్యాప్తి..? సీసీఎంబీ ఏం చెబుతోంది..

New N440K Covid Virus : ఘోరమైన కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో దేశం అల్లకల్లోలంగా మారుతుంది. కొత్తగా 'ఎన్ 440 కె' అనే కొవిడ్ వైరస్

కొత్తగా వచ్చిన N440K కొవిడ్ వైరస్ అంటే ఏమిటీ..! ఏపీలో ఎక్కువగా వ్యాప్తి..? సీసీఎంబీ ఏం చెబుతోంది..
New N440k Covid Virus
Follow us
uppula Raju

|

Updated on: May 07, 2021 | 4:29 PM

New N440K Covid Virus : ఘోరమైన కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో దేశం అల్లకల్లోలంగా మారుతుంది. కొత్తగా ‘ఎన్ 440 కె’ అనే కొవిడ్ వైరస్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇతర కొవిడ్‌తో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ వ్యాప్తి చెందుతోంది. విశాఖపట్నం, కర్ణాటక, తెలంగాణ, ఇతర దక్షిణ రాష్ట్రాలలో విస్తరిస్తుంది. నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ కనిపిస్తుందని తెలుస్తోంది.

వార్తా నివేదికల ప్రకారం.. N440K అనేది శక్తివంతమైన వేరియంట్. ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన కొవిడ్ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. వాస్తవానికి ఇది అసలు వేరియంట్ కంటే 15 రెట్లు ఎక్కువ వైరస్‌‌ను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అసలు వేరియంట్‌తో బారిన పడినట్లయితే అతను వారంలోపు డిస్ప్నియా లేదా హైపోక్సియా దశకు చేరుకుంటారు. కానీ ఒక వ్యక్తి N440K వేరియంట్‌ బారినపడినట్లయితే కేవలం మూడు-నాలుగు రోజుల్లో తీవ్రమైన దశకు చేరుకుంటారు. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో నలుగురికి వ్యాపిస్తుందని నివేదికలు సూచించాయి.

అన్ని తాజా నివేదికలను డీబంక్ చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) ఇటీవల కొన్ని విషయాలను పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కొవిడ్ వైరస్‌ కన్నా N440K వైరస్ కేసులు ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కొట్టిపడేసింది. CCMB డైరెక్టర్ రాకేష్ మిశ్రా N440K రాష్ట్రంలో 5 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. ఇంతకుముందు మనం చూసిన వైరస్ కంటే ప్రాణాంతకమైనదిగా ఎక్కడా రుజువు కాలేదన్నారు. N440K కొంతకాలంగా ఉంది అంతకుముందు ఇతర దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రాలో ఎన్‌440 కె 5 శాతం కన్నా తక్కువగా ఉంది. దాని స్థానంలో డబుల్ మ్యూటాంట్ లేదా మరేదైనా వేరియంట్ వచ్చే అవకాశం ఉందని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.

Randeep Guleria: ఆక్సిజన్ స్థాయి అంతఉంటే.. క్రిటికల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.. గులేరియా

Chota Rajan: కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి.. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు.. గంటకు 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు..