కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా..! అయితే కరోనా బారినపడే ప్రమాదం..? తెలుసుకోండి..

Corona Infection : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా..! అయితే కరోనా బారినపడే ప్రమాదం..? తెలుసుకోండి..
Kidney Disease

Corona Infection : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయి చాలామంది ఒంటరిగా మిగిలారు. కరోనా ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్న వారిపై విరుచుకుపడుతుంది. అందుకే ఆరోగ్య సమస్యలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్ని వ్యాధులున్నవారు, డయాలసిస్ చేసుకుంటున్నవారికి కొవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వారు అప్రమత్తంగా ఉండాలి.

సీకేడీ (క్రానిక్ కిడ్నీ డిసీజ్) ఉన్న రోగులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉంటారు. అంటువ్యాధులతో పోరాడటం వారికి కష్టమవుతుంది. మందుల మీద ఇంట్లో ఉన్నవారు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ డయాలసిస్ ఉన్నవారు బయటకు వెళ్ళకుండా ఉండలేరు. ఈ రోగులు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల వీరికి కరోనా ప్రమాదం ఎక్కువగా ఉంది. వీరు ఒంటరిగా, కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

ఈ వ్యక్తులు అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. ఈ రోగులు వారి ఆక్సిజన్‌ స్థాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారాన్ని తినాలి. వైద్యులతో సంప్రదింపులు చేస్తూ ఉండాలి. డయాలసిస్ కచ్చితం కనుక రోగులు బయటకు వెళ్ళేటప్పుడు డబుల్ మాస్క్ ధరించాలి. ప్రతి నెలా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి. రెండో వేవ్ విస్తృతంగా ఉంది కనుక దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోకపోవడం వంటి క్లాసిక్ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

కిడ్నీ మార్పిడి ఉన్నవారు యాంటీ-రిజెక్షన్ ఔషధాలను తీసుకోవడం కొనసాగించాలి. ఈ మందులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. టీకా గురించి చాలా మందికి అనుమానం ఉన్నప్పటికీ ఇది కొవిడ్ తీవ్రతను తగ్గిస్తుంది. చాలామంది వేసుకొని నిరూపించారు కూడా. ముఖ్యంగా సీకేడీ వంటి రోగులు తప్పనిసరిగా ముందుకు వెళ్లి టీకా తీసుకోవాలి. అప్పుడు కరోనాను వారు ఎదుర్కోగలరు.

టీకా వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! లేదంటే ప్రమాదంలో పడే అవకాశం.. తెలుసుకోండి..

ప్లాస్మా దానం నిజంగా కొవిడ్‌ను నయం చేస్తుందా..? ప్లాస్మాను ఎప్పుడు, ఎలా దానం చేయాలో తెలుసుకోండి..

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..