కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

Salman Khan Radhe Movie: బాలీవుడ్ లో అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్.. ఎంత సెన్షేషన్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..
Radhe

Salman Khan Radhe Movie: బాలీవుడ్ లో అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్.. ఎంత సెన్షేషన్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తోన్న రాధే మూవీలోని ఈ సాంగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఇక ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాధే మూవీ యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయంతో.. యావత్ దేశం సీటీమార్ అంటోంది. ఏంటా డిసీషన్..? కరోనా టైమ్ లో.. ఈ న్యూస్ కు ఇంత ప్రియార్టీ ఏంటి..? అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రాధే. ఈద్ సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో, ఓటీటీపై ఒకేసారి విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఈ మూవీ నుంచి.. మరో ఇంట్రెస్టింగ్ బజ్ రివీల్ చేసింది.. మూవీ యూనిట్. ఇప్పటికే సీటీమార్ సాంగ్ తో సల్మాన్ ఫ్యాన్స్ ఊగిపోతుండగా.. లేటెస్ట్ న్యూస్ వారిలో మరింత బూస్ట్ నింపింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ మహమ్మారి ఇప్పటి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులను.. పిల్లలే ఆశలుగా బతుకుతున్న వారికి చిన్నారులను దూరం చేసి ఎన్నో కుటుంబాల్లో చీకటిని నిపింది. ఇక దేశంలో రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం.. వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా రాధే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను.. కరోనాపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని ప్రకటించింది. సల్మాన్ మూవీ కాబట్టి.. మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇటు ఓటీటీలో కూడా పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తుండటంతో.. మొదటిరోజు వసూళ్లు పాతిక కోట్లు దాటే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో విరాళం అందుతుందని.. తెలుస్తుంది. వెండితెరపై ఎన్ని వేశాలేసినా.. హీరోల హృదయాల్లో మానవత్వం ఉంటుందని చెప్పడానికి.. దీన్నో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సల్మాన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Also Read: రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..