AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వూహాన్ ల్యాబ్ లో అసలు ఏం జరిగింది ? కోవిద్ వైరస్ పుట్టుకపై రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, అమెరికా పిలుపు,

కరోనా వైరస్ పుటుకపై రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని అమెరికా పిలుపునిచ్చింది. ఇందుకు అంతర్జాతీయ నిపుణులను అనుమతించాలని సూచించింది.

వూహాన్  ల్యాబ్ లో అసలు ఏం జరిగింది ? కోవిద్ వైరస్ పుట్టుకపై రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే,   అమెరికా పిలుపు,
We Have To Probe On Coronavirus Origin Says Us
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 26, 2021 | 2:43 PM

Share

కరోనా వైరస్ పుటుకపై రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని అమెరికా పిలుపునిచ్చింది. ఇందుకు అంతర్జాతీయ నిపుణులను అనుమతించాలని సూచించింది. వూహాన్ ల్యాబ్ లో రీసెర్చర్లు నిర్వహించిన పరిశోధనల తాలూకు రిపోర్టులను తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరిశీలిస్తున్నామని అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి జేవియర్ బెకెరా తెలిపారు. అయితే ఆ రిపోర్టులు అస్పష్టంగా ఉన్నాయని అన్నారు. ప్రపంచ ఆరోగ్య శాఖ నిర్వహించిన వార్షిక మినిస్టీరియల్ సమావేశానికి ఆయన వీడియో సందేశమిస్తూ.. 2019 డిసెంబరులో ఈ ల్యాబ్ లో ముగ్గురు పరిశోధకులు ఈ వైరస్ కి గురై ఆసుపత్రి పాలయ్యారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని,,సాధారణంగా గబ్బిలాలు తదితరాలపై రీసెర్చ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అన్నారు.మొదట సార్స్-కొవ్-2 గా వ్యవహరించిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్లే ఈ వైరస్ మూలాలను తెలుసుకునేందుకు రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగడం ఎంతయినా అవసరమన్నారు. దీనిపై అంతర్జాతీయ నిపుణులు పూర్తి స్థాయిలో అధ్యయనంతో బాటు దర్యాప్తు కూడా చేయాలనీ బెకెరా అభిప్రాయపడ్డారు.ఈ లేబొరేటరీలోనే దీని పుట్టుక జరిగిందనడానికి ఇంటెలిజెన్స్ వర్గాల్లోనే కొన్ని ఆధారాలు లేవని కూడా భావిస్తున్నామన్నారు. మరోవైపు టాప్ వైరాలజిస్ట్ డా. ఆంథోనీ ఫాసీ కూడా దీనితో ఏకీభవించారు.

మొదట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ తరువాత రెండో దశ దర్యాప్తు కూడా అవసరమేనని ఆయన చెప్పారు. తొలి దశలో ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. వంద శాతం వైరస్ పుట్టుక గురించి మనకు తెలియదన్నారు. అందువల్లే ఇది అనివార్యమన్నారు. ఇలా ఉండగా వూహన్ ల్యాబ్ లో ముగ్గురు రీసెర్చర్లు 2019 డిసెంబరులోనే వైరస్ కి గురై ఆసుపత్రి పాలయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన వార్తలను చైనా కొట్టి పారేసింది. ఏ రీసెర్చర్ కూడా దీనికి గురి కాలేదని, కొందరికి వచ్చిన రుగ్మత న్యుమోనియా మాత్రమేనని స్పష్టం చేసింది. నిరాధారమైన వార్తలను ప్రపంచ దేశాలు పట్టించుకోరాదని కోరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్… DRDOలో ఉద్యోగ ప్రకటన.. రూ.31,000 వేల వేతనం.. ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి..