నిరుద్యోగులకు గుడ్ న్యూస్… DRDOలో ఉద్యోగ ప్రకటన.. రూ.31,000 వేల వేతనం.. ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... DRDOలో ఉద్యోగ ప్రకటన.. రూ.31,000 వేల వేతనం..  ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి..
Follow us
Sanjay Kasula

|

Updated on: May 26, 2021 | 2:29 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 14చివరి తేదీ. ఇందులో మొత్తం 10 ఖాళీలున్నాయి. ఆఫ్‌లైన్ అప్లికేష‌న్ల‌ను వ‌చ్చేనెల 14లోపు పంపించాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 10

అర్హతలు: జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌, ఏరోనాటికల్ పోస్టుకు సంబంధిత‌ బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ‌త సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.

అభ్య‌ర్థుల వయసు: 28 ఏండ్ల‌లో…

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూన్ 14

ఖాళీలు:  ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 7, ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

వేతనం: రూ.31,000

ద‌ర‌ఖాస్తు విధానం: నిర్ణీత న‌మూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తిగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పోస్టుల్‌ ద్వారా దరఖాస్తును పంపించాలి.

పూర్తి వివరాల కోసం ఈ  వెబ్‌సైట్ చూడవచ్చు : https://www.drdo.gov.in/

దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్: The Director, DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex, Kanchanbagh PO, Hyderabad – 500058

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..