భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకున్న పరిపాలన, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మత పెద్దలను సంప్రదించిన తర్వాత, 2021-2022లో వైకుంఠ ఏకాదశి , ద్వాదశి లో మాత్రమే కాదు ఏకంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం పది రోజుల పాటు ఇవ్వాలని నిర్ణయించారు. అలా ఇప్పుడు పది రోజుల పాటు స్వామివారిని ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే వీలు కలిగింది. ఈ నిర్ణయం తర్వాత శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడి దగ్గర ఉన్న ఉత్తర ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది. భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడానికి.. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. భారీ రద్దీని నియంత్రించడం, భక్తులందరికీ దర్శనానికి అవకాశం కల్పించడం దీని లక్ష్యం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను పది రోజులకు విస్తరించింది.