AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటలో నూనె ఎక్కువైందని ఆందోళన పడుతున్నారా..? ఇదిగో చక్కటి ఉపాయం దొరికింది..! వీడియో చూస్తే అవాక్కే..

ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో నూనెను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, బయట కొనుగోలు చేసిన ఆహారాలలో చాలా నూనె ఉంటుంది. ఈ నూనెను ఎలా తొలగించాలో చాలా మందికి అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, దీనిలో అదనపు నూనెను తీయడం ఎలాగో ఒక ఉపాయం చెప్పారు.

వంటలో నూనె ఎక్కువైందని ఆందోళన పడుతున్నారా..? ఇదిగో చక్కటి ఉపాయం దొరికింది..! వీడియో చూస్తే అవాక్కే..
Excess Oil
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2023 | 7:56 AM

Share

వంట చేసేటప్పుడు ఆహారం రుచిని పెంచుకోవడానికి నూనెను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కొన్ని ఆహారాలను నూనెలో వేయించినప్పుడు మరీ ఎక్కువ నూనెను ఉపయోగిస్తారు. వంట చేయటానికి కొంత వరకు నూనె అవసరం అయినప్పటికీ, దానిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ రోజుల్లో ప్రజలు తమ ఆహారంలో నూనెను తగ్గించడం పట్ల అప్రమత్తంగా ఉన్నారు. డైటరీ ఆయిల్ తక్కువ తీసుకోవడం, సాధారణంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండటం వంటివి పాటిస్తున్నారు. అధిక ఫ్యాట్ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్న నేపథ్యంలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ తినాల్సి వస్తే.. వేయించిన ఆహారాన్ని టిష్యూ పేపర్‌లో వేసి అదనపు నూనెను తొలగించడానికి ప్రయత్నిస్తారు. అయితే, అప్పుడప్పుడు కూరల్లో నూనె ఎక్కువైతే..రెండు ఆలుగడ్డలను కట్‌ చేసి వేస్తుంటారు. ఇలా ఆలూ కూరలోని ఆయిల్‌ని పీల్చేసుకుంటుది. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో నూనెను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, బయట కొనుగోలు చేసిన ఆహారాలలో చాలా నూనె ఉంటుంది. ఈ నూనెను ఎలా తొలగించాలో చాలా మందికి అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, దీనిలో అదనపు నూనెను తీయడం ఎలాగో ఒక ఉపాయం చెప్పారు.

వైరల్ వీడియోను maythesciencebewithyou అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో, రెస్టారెంట్ లోపల ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని ముందు ఒక పెద్ద బాండీ ఉంది.. ఈ గిన్నెలో రెండు వేర్వేరు పదార్థాలను చూపించే రెండు భాగాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ చూడగానే ఆ వీడియో విదేశాలకు చెందినదని అర్థమవుతోంది. ఇంతలో ఒక వంటకంలో అధిక మొత్తంలో నూనె ఉపయోగించినట్లు కనిపిస్తుంది. ఈ నూనెను తీయడానికి ఒక వ్యక్తి ఐస్‌ను ఉపయోగించడం కనిపిస్తుంది. అతడు తన చేతిలో పెద్ద స్నోబాల్‌ను పట్టుకుని ఉన్నాడు. దానిని అతను టిష్యూ పేపర్‌తో పట్టుకున్నాడు. స్నోబాల్ ఆయిల్ వంటకంలో వేయగానే మునిగిపోతుంది. ఎక్‌స్ట్రా ఆయిల్‌ అంత ఆ స్నోన్‌ బాల్‌కి అంటుకుని గట్టి పూతలా ఏర్పడింది. అప్పుడు ఆ స్నోన్‌ బాల్‌ని బయటకు తీసి మరో గిన్నెలో స్పూన్‌తో ఆ కవర్‌ని తొలగిస్తున్నాడు. వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియో చూస్తే ఎంత నూనె వాడాలో తెలుస్తుంది. అదనపు నూనెను తొలగించే ఈ పద్ధతిని ప్రజలు ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను చూసిన చాలా మంది రకరకాలుగా స్పందించారు. ముందు మీరు అంత నూనె వాడటం మానేయండి.. ఆ తర్వాత ఇలాంటి తంటాలు ఎందుకు అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..