4 నెలలుగా మార్చురీ ముందు తిరుగుతున్న కుక్క.. ఎందుకని ఆరా తీసిన ఆస్పత్రి సిబ్బంది.. ఏమైందంటే..

కొన్నిసార్లు అవి తన యజమాని ప్రాణాలను కాపాడటానికి కష్టపడతాయి. ఒక్కోసారి బాస్ ఏది చెబితే అది చేయడానికి పరుగెత్తుతాయి.. ప్రస్తుతం, అటువంటి విశ్వాసం గల కుక్కకకు సంబంధించి హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిని చూసిన తర్వాత మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే, అతని విశ్వాసం, యజమానిపై ప్రేమ గురించి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

4 నెలలుగా మార్చురీ ముందు తిరుగుతున్న కుక్క.. ఎందుకని ఆరా తీసిన ఆస్పత్రి సిబ్బంది.. ఏమైందంటే..
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2023 | 2:27 PM

ఇతర మూగ జంతువులతో పోలిస్తే కుక్క చాలా నిజాయితీ, విశ్వాసం గల జంతువుగా చెబుతారు. ఎందుకంటే పెంపుడు కుక్కలు తన యజమానిని అమితంగా ప్రేమిస్తాయి.. ఈ పెంపుడు జంతువు విశ్వాసానికి సంబంధించిన వివిధ సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు అవి తన యజమాని ప్రాణాలను కాపాడటానికి కష్టపడతాయి. ఒక్కోసారి బాస్ ఏది చెబితే అది చేయడానికి పరుగెత్తుతాయి.. ప్రస్తుతం, అటువంటి విశ్వాసం గల కుక్కకకు సంబంధించి హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిని చూసిన తర్వాత మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే, అతని విశ్వాసం, యజమానిపై ప్రేమ గురించి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

నివేదికల ప్రకారం, కేరళలోని కన్నూర్ జిల్లా ఆసుపత్రిలో ఒక కుక్క తన యజమాని కోసం నాలుగు నెలలుగా వేచి ఉంది. ఈ కుక్క తన యజమాని బయటకు వస్తాడని, తనను చూస్తాననే నమ్మకంతో ఇక్కడే ఆసుపత్రి మార్చురీ వెలుపల వేచి ఉంది. కానీ తన యజమాని ఎప్పటికీ బయటకు రాలేడనే ఆలోచన ఈ కుక్కకు లేదు. ఎందుకంటే- దాని యజమాని చనిపోయాడు. అయినా ఈరోజు లేదా రేపు తన యజమాని హాస్పిటల్ నుండి బయటకు వస్తారని ఆశతో హాస్పిటల్ బయట తిరుగుతూ ఇక్కడే ఉంటోంది. తన యజమాని చనిపోయాడని పాపం ఆ మూగ జీవికి తెలియదు.

ఇవి కూడా చదవండి

కుక్క తన యజమాని మృతదేహాన్ని అదే డోర్‌లోంచి ఆసుపత్రి మార్చురీలోకి తీసుకురావడం చూసింది..కానీ, మరో మార్గం గుండా అతడిని బయటకు తీసుకెళ్లిన విషయం దానికి తెలియదు. కాబట్టి కుక్క ఇప్పటికీ తన యజమాని మార్చురీలో ఉన్నట్లు భావిస్తుందని ఒక ఉద్యోగి చెప్పారు. మూడు నాలుగు నెలల క్రితం మార్చురీ బయట కుక్క కూర్చుని ఉండటాన్ని సిబ్బంది గమనించారు. కుక్క ఇంట్లో నుంచి తప్పిపోయి ఉంటుందని తొలుత భావించారు. కాబట్టి వారు కుక్కను జాగ్రత్తగా చూసుకోవడం, ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాదు ఆ కుక్కకు ‘రాము’ అని పేరు పెట్టారని అక్కడి ఉద్యోగులు చెప్పారు.

ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ.. “కొన్ని నెలల క్రితం కుక్క దాని యజమానితో వచ్చింది. ఆస్పత్రికి తరలించగా యజమాని మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పటి నుండి రాము తన యజమాని కోసం ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు తన యజమాని మార్చురీ నుండి బయటకు వస్తాడని ఆ మూగజీవి విశ్వాసం. కానీ, దురదృష్టవశాత్తు అది అలా జరగదు. ప్రస్తుతం, ఈ కుక్క వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అందులో పెంపుడు కుక్క ఆ ఆసుపత్రి వెలుపల నిలబడి ఉండటం కనిపించింది. ఈ వీడియోపై చాలా మంది స్పందిస్తున్నారు. ఈ సంఘటనను హాలీవుడ్ చిత్రం హచీ: ఎ డాగ్స్ టేల్‌తో పోల్చారు. ఇందులో కుక్క మాస్టర్ కోసం ఎదురుచూస్తుంది. అంతేకాదు ఈ ఘటన హృదయాలను హత్తుకునేలా ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది తమ కళ్లలో నీళ్లు తిరిగారని కూడా చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..