AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: హాయిగా ఎగిరే చిలుకమ్మ.. ఎందుకో ఇలా సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చింది..? విచిత్రమైన వీడియో వైరల్‌..

చిలుక సైకిల్ పెడల్స్ తిప్పగానే, సైకిల్ రోడ్డు మీద పరుగెత్తడం ప్రారంభిస్తుంది. నెటిజన్లు ఈ భిన్నమైన సైకిల్‌ను, పైగా చిలుక సైకిల్‌ తొక్కడం చూసి అవాక్కై చూస్తున్నారు..ఇప్పుడిక సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఇదే అంశంపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఒకరికీ మించి మరోకరు చిలుకను పొగిడేస్తూ ఆశ్చర్యకరమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. రెక్కలు మడిచిపెట్టుకుని ఎందుకో ఈ చిలుకమ్మ సైకిల్ తొక్కుతూ కష్టపడుతుందంటూ ఫన్నీగా అడుగుతున్నారు..

Video Viral: హాయిగా ఎగిరే చిలుకమ్మ.. ఎందుకో ఇలా సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చింది..? విచిత్రమైన వీడియో వైరల్‌..
Parrot Riding A Bicycle
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2023 | 1:18 PM

చిలుక మనిషిలా మాట్లాడగలిగే పక్షి. తియ్య తియ్యటి చిలుక పలుకులతో అందరినీ కట్టపడే చిలుక ఇప్పుడు మనుషుల్లా ప్రవర్తించడం ప్రారంభించింది. అవును మీరు చదివింది నిజమే.. ఎందుకంటే.. ఇక్కడ ఒక చిలుక మనుషుల్లానే సైకిల్ తొక్కుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మీరు నమ్మరు కానీ ఇది నిజంగా జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అయోమయంలో పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని క్రియేటివ్‌నెస్ట్.ఐడియాస్ అనే పేజీలో చిలుక సైకిల్ తొక్కుతున్న ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో చిలుక సైకిల్ తొక్కడం చూసిన జనాలు ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు..

వైరల్‌ వీడియోలో ఆసక్తికరంగా ఒక చిలుక సైకిల్‌ తొక్కుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ సైకిల్‌ చిలుకల కోసమే క్రియేట్‌ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక సైకిల్ పెడల్స్ రూపంలో జతయారు చేసిన చక్రాలను కలిగి ఉంది. ప్యాడ్‌కి చిన్న హ్యాండిల్స్‌ని జత చేసి ఉండగా, వాటిపై రెండు కాళ్లతో  నిలబడి హాయిగా రైడ్ చేసుకుంటూ వెళ్తోంది. చిలుక సైకిల్ పెడల్స్ తిప్పగానే, సైకిల్ రోడ్డు మీద పరుగెత్తడం ప్రారంభిస్తుంది. నెటిజన్లు ఈ భిన్నమైన సైకిల్‌ను, పైగా చిలుక సైకిల్‌ తొక్కడం చూసి అవాక్కై చూస్తున్నారు..ఇప్పుడిక సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఇదే అంశంపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఒకరికీ మించి మరోకరు చిలుకను పొగిడేస్తూ ఆశ్చర్యకరమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. రెక్కలు మడిచిపెట్టుకుని ఎందుకో ఈ చిలుకమ్మ సైకిల్ తొక్కుతూ కష్టపడుతుందంటూ ఫన్నీగా అడుగుతున్నారు..

ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ బైక్‌ను, చిలుకను నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు. రెక్కలు ఉన్నప్పటికీ సైకిల్‌పై వెళ్లే చిలుకను కొందరు ఎగతాళి చేశారు. వైరల్ వీడియోపై ఒకరు ఇలా వ్యాఖ్యానించారు,..ఒక పక్షి ఏదైనా చేయగలదు, కానీ రెక్కలు ఉన్నప్పుడు మీకు ఇలా కష్టపడం ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరు తయారు చేసారో గానీ, ఆ దేశీ జుగాడ్‌ని వందనలు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..