Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదేం తోముడురా సామీ.. హెయిర్‌ స్టైల్‌ కోసం వచ్చిన కస్టమర్లకు బార్బర్‌ ఇచ్చిన కట్టింగ్‌..! చూస్తే..

బార్బర్ చేసిన ఈ చర్యను చూసి సెలూన్‌లో కూర్చున్న వారంతా నవ్వుతున్నారు. కొంతమంది పెద్దగా పగలబడి నవ్వడం కూడా కనిపించింది. బార్బర్‌ చేసిన ఈ పనికి క్లయింట్లు కూడా కోపం తెచ్చుకోకుండా బిగ్గరగా నవ్వుతున్నారు. అయితే, వీడియో చూస్తుంటే ఇది కేవలం సరదా కోసమే చేసిన చిలిపి వీడియోలా అనిపిస్తోంది. ఎందుకంటే అలాంటి పని నిజంగా ఎవరితోనైనా చేస్తే, అది వ్యక్తిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. అక్కడ విధ్వంసం సృష్టించేలా మారుతుంది పరిస్థితి.

వార్నీ ఇదేం తోముడురా సామీ.. హెయిర్‌ స్టైల్‌ కోసం వచ్చిన కస్టమర్లకు బార్బర్‌ ఇచ్చిన కట్టింగ్‌..! చూస్తే..
Barber
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2023 | 11:31 AM

ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక బార్బర్ తన క్లయింట్‌తో చాలా దారుణంగా ప్రవర్తించడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. మీరు సెలూన్‌కి వెళ్లినప్పుడు బార్బర్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. సేవకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తారు.. అయితే ఈ వైరల్ వీడియోలో భిన్నమైన విషయం కనిపించింది. వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు.. ఇలాంటి సెలూన్లకు వెళ్లాలంటేనే భయంతో హడలెత్తిపోతారు. వైరల్ వీడియోలో .. ఇద్దరు క్లయింట్లు హెయిర్‌ కట్టింగ్‌ కోసం సెలూన్‌కు వచ్చారు. మిగతా బార్బర్‌ల మాదిరిగానే ఈ సెలూన్‌లోని బార్బర్‌ కూడా తనకు మంచి సేవలందించాలని ఆకాంక్షించారు. కానీ, ఇక్కడ షాపులో బార్బర్‌ వీరికి ఊహించని షాక్‌ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

వైరల్‌ అవుతున్న వీడియోలో ఇద్దరు కస్టమర్లు బార్బర్‌ షాపుకు వచ్చారు. అంతలోనే సూటు బూటు వేసుకుని హుందాగా ఉన్న బార్బర్‌.. కస్టమర్లపై విచిత్రమైన దాడికి దిగాడు..కస్టమర్లు ఇద్దరూ తమ హెయిర్‌ వాష్‌ చేసుకుంటున్నట్టుగా అక్కడి దృశ్యం కనిపిస్తుండగా, ఇంతలో బార్బర్‌ వచ్చి క్లయింట్‌ని విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు.. బార్బర్ మరొక క్లయింట్‌ను తలపై చెప్పుతో కొట్టడం కూడా కనిపించింది. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. బార్బర్ చేసిన ఈ చర్యను చూసి సెలూన్‌లో కూర్చున్న వారంతా నవ్వుతున్నారు. కొంతమంది పెద్దగా పగలబడి నవ్వడం కూడా కనిపించింది. బార్బర్‌ చేసిన ఈ పనికి క్లయింట్లు కూడా కోపం తెచ్చుకోకుండా బిగ్గరగా నవ్వుతున్నారు. అయితే, వీడియో చూస్తుంటే ఇది కేవలం సరదా కోసమే చేసిన చిలిపి వీడియోలా అనిపిస్తోంది. ఎందుకంటే అలాంటి పని నిజంగా ఎవరితోనైనా చేస్తే, అది వ్యక్తిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. అక్కడ విధ్వంసం సృష్టించేలా మారుతుంది పరిస్థితి. కానీ, ఇక్కడ అవేవీ జరగలేదు. అంతా హ్యాపీగా, నవ్వుతూ ఉన్నారు. దీంతో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by MREBK (@mrebk_youtube)

చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ స్పందనలను పంచుకున్నారు. ఒక వినియోగదారు, ఇందులో తమాషా ఏమీ లేదు’ అని అన్నారు. మరో వినియోగదారు, ‘ఈ మంగలి ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని అన్నారు. ‘తల వెనుక భాగంలో ఇలా కొట్టకూడదు’ అని మరో యూజర్ చెప్పాడు. మొత్తానికి వీడియో మాత్రం బ్రేకులు లేని బైకులా నెట్టింట తెగ దూసుకుపోతుంది. నెటిజన్లకు నవ్వుల పంట పండిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..