బాబోయ్‌.. ఇంకెప్పుడు మారుతార్రా బాబు.. కొండచిలువ మాంసం కోసం ఎగబడుతోన్న జనం.. ఎక్కడంటే..

ఈ వీడియో ఎంతో జుగుప్సాకరంగా ఉంది. ఈ వీడియో చైనాకు చెందినదని చెబుతున్నారు. దీని గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ. ఈ వీడియో చూసిన సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు. కొండచిలువను కూడా తింటారంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు స్పందించారు..దయచేసి జంతువులను రక్షించండి అంటూ మరొకరు ట్విట్‌ చేశారు. ఓ మై గాడ్.. ఇది చాలా అసహ్యంగా, భయానకంగా ఉందంటూ మరొకరు వ్యాఖ్యనించారు.

బాబోయ్‌.. ఇంకెప్పుడు మారుతార్రా బాబు.. కొండచిలువ మాంసం కోసం ఎగబడుతోన్న జనం.. ఎక్కడంటే..
Selling Python Meat
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2023 | 12:08 PM

2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో అందరూ చూశారు. కరోనా కారణంగా చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. తమ వారి చివరి చూపుకు కూడా నోచుకోని ఎన్నో కుటుంబాలు పుట్టేడు దుంఖంతో ఇప్పటికీ విలపిస్తున్నాయి. కరోనా మహమ్మారికి భయపడి చాలా మంది చనిపోయిన తమవారిన కళ్లరా చూసుకుని, చేతులతో ముట్టుకుని, కౌగిలించుకొని ఏడ్చే అవకాశం కూడా ఎవరికీ లభించలేదు. ఈ మహమ్మారిపై ప్రపంచం ఎప్పుడూ చైనానే నిందిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి మొదట అక్కడి నుంచే వ్యాపించడం ప్రారంభించింది. చైనీస్ ప్రజలు వింత, అసహ్యకరమైన ఆహారం తింటారని అందరికీ తెలుసు. వారు అలాంటి జంతువులను పచ్చిగా కూడా నమలుతారు. దీని గురించి ఆలోచిస్తేనే అసహ్యం కలిగిస్తుంది. అలాంటిదే ఇక్కడో అసహ్యకరమైన వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా అసహ్యకరమైన వీడియో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా వాక్‌ అంటూ వామిట్‌ చేసుకున్న చేసుకుంటారు.. అంత దారుణంగా ఉంది వీడియో.. ఈ వీడియోలో ఒక అమ్మాయి కొండచిలువ మాంసాన్ని భారీ మొత్తంలో విక్రయిస్తున్నట్లు కనిపిస్తుంది. మహిళ రోడ్డుపక్కన కొండచిలువ మాంసం స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్ని బహిరంగంగా విక్రయిస్తుంది. అంతేకాదు.. ఒక వ్యక్తి ఆ మాంసం తీసుకోవడానికి వేచి ఉన్నాడు. కొండచిలువ శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో అది చనిపోయిందని అర్థమవుతుంది. ఆ మహిళ కొండచిలువను పెద్ద కత్తితో ముక్కలుగా చేసి దాని మాంసాన్ని ఆ వ్యక్తికి ఇచ్చింది. వీడియో చూసిన తర్వాత యూజర్లు భయాందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Md Foysal Rana (@foy_sal_v)

ఈ వీడియో ఎంతో జుగుప్సాకరంగా ఉంది. ఈ వీడియో చైనాకు చెందినదని చెబుతున్నారు. దీని గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ. ఈ వీడియో చూసిన సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు. కొండచిలువను కూడా తింటారంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు స్పందించారు..దయచేసి జంతువులను రక్షించండి అంటూ మరొకరు ట్విట్‌ చేశారు. ఓ మై గాడ్.. ఇది చాలా అసహ్యంగా, భయానకంగా ఉందంటూ మరొకరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..